https://oktelugu.com/

Agent Movie Review: అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ఫుల్ రివ్యూ

Agent Movie Review: నటీనటులు: అక్కినేని అఖిల్ , మమ్మూటీ , సాక్షి వైద్య ,సంపత్ రాజ్ , డినో మోరియా మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాఫ్ తమీజా, భీమ్స్ డైరెక్టర్ : సురేందర్ రెడ్డి నిర్మాతలు : సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర కథ : వక్కంతం వంశీ అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ […]

Written By:
  • admin
  • , Updated On : April 28, 2023 / 11:22 AM IST
    Follow us on

    Agent Movie Review: నటీనటులు: అక్కినేని అఖిల్ , మమ్మూటీ , సాక్షి వైద్య ,సంపత్ రాజ్ , డినో మోరియా

    మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాఫ్ తమీజా, భీమ్స్
    డైరెక్టర్ : సురేందర్ రెడ్డి
    నిర్మాతలు : సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర
    కథ : వక్కంతం వంశీ

    అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అంచనాలు తారాస్థాయి లో ఉండేవి, బిజినెస్ కూడా 70 కోట్ల రేంజ్ పలికింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి కూడా ఒక నిర్మాత, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 37 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది.డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ఓవరాల్ గా పెట్టిన బడ్జెట్ అయితే రికవరీ అయ్యి ఉంటుంది కానీ, థియేట్రికల్ బిజినెస్ 70 కోట్లకు జరిగే రేంజ్ ఉన్నప్పటికీ 37 కోట్లకు జరిగింది. అలాంటి బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాము.

    కథ :

    ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ ని అరికట్టడానికి స్పెషల్ ఆఫీసర్ కలోనోల్ మహాదేవ్ (మమ్మూటీ) ఆద్వర్యం లో ఒక గ్రూప్ ఏర్పడుతుంది. ఈ గ్రూప్ నుండి వెళ్లిన ఏజెంట్స్ అందరూ ఆ టెర్రరిస్ట్ ముఠా ని పట్టుకోవడం విఫలం అవుతూ ఉంటారు.ఆ సమయం లోనే మహాదేవ్ కి అఖిల్ కనిపిస్తాడు. అతని ఉత్సాహం , తెగింపు చూసి స్పై ఏజెంట్ గా ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఛేదించడానికి పంపిస్తాడు.మహాదేవ్ ఇచ్చిన టాస్కు ని అఖిల్ పూర్తి చేస్తాడు.పని అయిపోయిన తర్వాత మహాదేవ్ తన టీం కి అఖిల్ ని చెంపేయమని చెప్తాడు..అసలు ఎందుకు మహాదేవ్ అఖిల్ ని చంపాలనుకున్నాడు..?, అతనికి టెర్రరిస్ట్స్ కి ఏమైనా లింక్ ఉందా..?, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ :

    సురేందర్ రెడ్డి సినిమాలు అంటే అందరూ కచ్చితంగా స్టైలిష్ టేకింగ్, అదిరిపొయ్యే రేంజ్ హీరో క్యారక్టరైజేషన్ ని ఆశిస్తారు. సినిమా స్టోరీ మామూలుగా ఉన్న తన అద్భుతమైన టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే తో వేరే లెవెల్ కి తీసుకెళ్తాడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రం లో కూడా అదే ప్రయత్నం చేసాడు కానీ, ఎక్కడో ఎదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ కనిపిస్తాది.కానీ అఖిల్ ని మాత్రం చాలా స్టైలిష్ గా, ఎనెర్జిటిక్ గా చూపించాడు. అఖిల్ ఈ సినిమా కోసం పడిన కష్టం, శ్రమ మొత్తం వెండితెర మీద ప్రతీ ఫ్రేమ్ లో కనిపించింది.నటన పరంగా కూడా ఆయన చాలా పరిణీతి చెందాడు కానీ, కొన్ని సన్నివేశాల్లో బాగా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఇక మలయాళం మెగాస్టార్ మమ్మూటీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.సాధారణంగా ఇలాంటి స్పెషల్ రోల్స్ చెయ్యడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని మమ్మూటీ,ఈ సినిమా ఎందుకు ఒప్పుకొని చేసాడో ఆయన పాత్ర ని చూస్తే అర్థం అయిపోతుంది.

    చాలా స్థిరమైన నటన తో ప్రేక్షలను అలరిస్తాడు, ముఖ్యంగా ఆయన పాత్ర లో ఉన్న షేడ్స్ , ఇచ్చే ట్విస్ట్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఇక హీరోయిన్ సాక్షి వైద్య కూడా తన పరిధిమేర పర్వాలేదు అనిపించేలా చేసింది. సురేందర్ రెడ్డి ఆమె పాత్రకి మరింత స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. క్వాలిటీ పరంగా నిర్మాత ఎక్కడ కూడా తగ్గలేదని తెలుస్తుంది.చాలా రిచ్ గా స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తీసాడు. ఇక ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి.  హిప్ హాప్ తమీజా అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  ఒక్క పాట కూడా వినసొంపుగా లేకపోవడమే ఈ సినిమాకి హైప్ రాకపోవడానికి కారణలో ఒకటిగా నిలిచిపోయింది.మొత్తం మీద ఒక డీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ని అందించాడు సురేందర్ రెడ్డి.

    చివరి మాట :

    స్పై యాక్షన్ థ్రిల్లెర్స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది, సినిమాలో వచ్చే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి అనుభూతిని ఇస్తుంది. ఓవరాల్ గా ఒక డీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఏజెంట్ ని చెప్పొచ్చు

    రేటింగ్ : 2.5/5