https://oktelugu.com/

Agent Movie Twitter Review: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ: స్పై రోల్ లో అఖిల్ అదుర్స్… సినిమా ఎలా ఉందంటే?

Agent Movie Twitter Review: మాస్ హీరోగా ఎదగడం అంత ఈజీ కాదు. ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ని ఆకర్షించే స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. నాగార్జునకు ఇద్దరు కుమారులు కాగా నాగ చైతన్య టైర్ టూ హీరోగా సెటిల్ అయ్యాడు. ఆయనకంటూ మార్కెట్ ఉంది. లవ్ అండ్ రొమాంటిక్ జోనర్లో విజయాలు సాధిస్తున్నాడు. చైతన్య మాస్ హీరోగా ఎదిగే సూచనలు కనిపించడం లేదు. గతంలో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కనీసం అఖిల్ ని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 28, 2023 / 08:14 AM IST
    Follow us on

    Agent Movie Twitter Review: మాస్ హీరోగా ఎదగడం అంత ఈజీ కాదు. ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ని ఆకర్షించే స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. నాగార్జునకు ఇద్దరు కుమారులు కాగా నాగ చైతన్య టైర్ టూ హీరోగా సెటిల్ అయ్యాడు. ఆయనకంటూ మార్కెట్ ఉంది. లవ్ అండ్ రొమాంటిక్ జోనర్లో విజయాలు సాధిస్తున్నాడు. చైతన్య మాస్ హీరోగా ఎదిగే సూచనలు కనిపించడం లేదు. గతంలో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కనీసం అఖిల్ ని అయినా స్టార్ హీరోగా నిలబెట్టాలనేది నాగార్జున ఆశ. అందుకే ‘అఖిల్’ మూవీతో భారీగా లాంచ్ చేశాడు. వివి వినాయక్ రూ. 30 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన అఖిల్ నిరాశపరిచింది.

    దాంతో అఖిల్ వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో ఆయన మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నారు. హిట్ రాగానే మరలా మాస్ ఇమేజ్ పై కన్నేశాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ టైటిల్ తో స్పై థ్రిల్లర్ చేశారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఏజెంట్ విడుదలైంది. ప్రీమియర్స్ ఇప్పటికే ముగియగా టాక్ బయటకు వచ్చింది. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో ఏజెంట్ కి నెగిటివ్ టాక్ వినిపిస్తుంది.

    దర్శకుడు సురేందర్ రెడ్డి రైటింగ్, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదంటున్నారు. అఖిల్ పెర్ఫార్మన్స్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆయన ఏజెంట్ పాత్ర కోసం బాగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేశారు. కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ సాధించారు. యంగ్ ఏజెంట్ గా అఖిల్ లుక్ అద్భుతం. అయితే లాజిక్ లేని సన్నివేశాలు, ఆకట్టుకొని కథనం ఆడియన్స్ ని నిరాశపరిచాయి. ఏజెంట్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అఖిల్ కి మరలా నిరాశ తప్పేలా లేదని మూవీ చూసిన ఆడియన్స్ అభిప్రాయం.

    నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ పర్లేదు. హీరోయిన్ తో అఖిల్ కెమిస్ట్రీ ఓకే. యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఏజెంట్ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేశారు. అంత పెద్ద స్టార్ ని సురేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదని ప్రీమియర్ టాక్. అయితే సినిమా పూర్తి రివ్యూ తెలియాలంటే ఇండియాలో ఫస్ట్ షో పడాలి. మరి చూద్దాం సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ నడుస్తుండగా… అఖిల్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో..

    https://twitter.com/Perthist_/status/1651747089867481092