Tiger: మన సాధారణంగా ఎవరైనా బలమైన వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అతడు పులి లాంటి వాడు. పులి పంజా లాగా ఉంటుంది ఇలా రకరకాల ఉపమానాలతో పోల్చుతూ ఉంటాం.. మనలో నిజంగా ఎవరు కూడా పులి కోపాన్ని చూసి ఉండరు. ఏదో డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ ఛానెల్స్ లో చూడటం తప్ప..కానీ ఈ పర్యాటకులకు నిజంగా పులి కోపమంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. లిప్త పాటు కాలంలో చావు ముఖం మీద గాండ్రించినట్టు అనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో..
మనదేశంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనే ఒక అడవి ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు నివాసం ఉంటాయి. పర్యాటకులు వీటిని చూసేందుకు భారీగా తరలివస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో అక్కడి జంతువులను చూసేందుకు కొంతమంది పర్యాటకులు భారీగా తరలివచ్చారు.. వాటిని కెమెరాల్లో బంధిస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళ కెమెరాలు క్లిక్ మనడం ఆగిపోయాయి. ప్రశాంతమైన అడవిలో గంభీరమైన అలికిడి. వారు చూస్తున్నది నిజమో లేక అబద్ధం అనుకునే లోపే ఎదురుగా పెద్దపులి ప్రత్యక్షమైంది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని అన్ని నిలిపివేశాడు. పర్యాటకులు పులిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
పులికి తిక్క రేగింది
పర్యటకులు ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో కాసేపు గడబిడ జరిగింది. దీంతో పులికి కరిగింది తిక్క రేగింది. అసలే ఆకలి మీద ఉందేమో వారి సఫారీ జీప్ మీద దాడి చేసినందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా గాండ్రించడం మొదలుపెట్టింది. అంతే కాదు సఫారి జీప్ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది.. దీంతో పర్యాటకులు ప్రాణ భయంతో బిగ్గరగా కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అక్కడి నుంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో పులి అక్కడి నుంచి వెనుతిరిగింది..
సోషల్ మీడియాలో వైరల్
కాగా ఈ దృశ్యాలను పర్యటకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “కాసేపు అక్కడే ఉంటే పులి దాడి చేసి చంపి తినేసేది. ఆ డ్రైవర్ సమయస్ఫూర్తికి శతకోటి వందనాలు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Striped monk gets irritated
What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR— Susanta Nanda (@susantananda3) April 26, 2023