https://oktelugu.com/

గుడ్ న్యూస్: కరోనాను జయించిన రాజశేఖర్.. డిశ్చార్జ్

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన పడిన సంగతి తెల్సిందే. కరోనా నుంచి రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీ త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ భార్య జీవిత కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా కరోనా నుంచి బయటపడింది. అయితే కరోనా నుంచి రాజశేఖర్ కోలుకోకపోవడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రాజశేఖర్ ఆరోగ్యంపై తాజాగా జీవితా రాజశేఖర్ తాజాగా స్పందించారు. రాజశేఖర్ ఇంతకముందు కంటే చాలా త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 09:00 PM IST
    Follow us on

    టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన పడిన సంగతి తెల్సిందే. కరోనా నుంచి రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీ త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ భార్య జీవిత కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా కరోనా నుంచి బయటపడింది. అయితే కరోనా నుంచి రాజశేఖర్ కోలుకోకపోవడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

    రాజశేఖర్ ఆరోగ్యంపై తాజాగా జీవితా రాజశేఖర్ తాజాగా స్పందించారు. రాజశేఖర్ ఇంతకముందు కంటే చాలా త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది. కరోనా సోకిన తొలినాళ్లలో ఆయన వైద్యానికి స్పందించకపోవడంతో చాలా భయం వేసిందని తెలిపింది. అయితే వైద్యులు ప్రతిక్షణం దగ్గరుండి ఆయనకు వైద్యం అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపింది.

    ప్రస్తుతం తన భర్తకు ఆక్సిజన్ అవసరం లేకుండానే వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయన త్వరగానే డిశ్చార్జ్ అవుతారనే నమ్మకం ఉందని జీవిత తెలిపింది. అభిమానుల ప్రార్థనలతోనే ఆయన కరోనాను జయిస్తున్నారని రాజశేఖర్ ఆరోగ్యం పరిస్థితులను వివరించింది.

    తాజాగా రాజశేఖర్ కరోనాను జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి రాజశేఖర్ ను డిశ్చార్జ్ చేశారు. తన సతీమణితో కలిసి ఉన్న ఫొటోను రాజశేఖర్ అభిమానులతో పంచుకున్నారు. ఆస్పత్రి సిబ్బందితో కూడా రాజశేఖర్ ఫొటోలు దిగారు.

    ఈ సందర్భంగా తన భర్తను కరోనా నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు నెలరోజుల పాటు రాజశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆస్పత్రి తమను బాగా చూసుకుందని.. అభిమానుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నాడని జీవిత సంతోషం వ్యక్తం చేసింది.