https://oktelugu.com/

రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం : ఆరుగురి మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జిల్లాలోని పటాన్ చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై హైదరాబాద్ నుంచి పటాన్ చెరు వైపు వెళ్తున్న బోలేరో వాహనాన్ని వెనుక నుంచి వస్తున్నగుర్తు తెలియన వాహనం ఢీకొట్టింది. దీంతో బోలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను పోస్టు మార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించామని స్థానిక సీఐ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 10, 2020 / 08:07 AM IST
    Follow us on

    సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జిల్లాలోని పటాన్ చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై హైదరాబాద్ నుంచి పటాన్ చెరు వైపు వెళ్తున్న బోలేరో వాహనాన్ని వెనుక నుంచి వస్తున్నగుర్తు తెలియన వాహనం ఢీకొట్టింది. దీంతో బోలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను పోస్టు మార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించామని స్థానిక సీఐ రామిరెడ్డి తెలిపారు. మరణించిన వారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు.  కాగా బోలేరో వాహనంలో 10 మంది ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు.