మల్లిక చెప్పింది.. కమలా ఉపాధ్యక్షురాలైంది

మల్లికా శెరావత్.. ఒకప్పుడు తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. శృంగారతారగా పేరుగాంచింది. చాలా హాట్ హాట్ బాలీవుడ్ సినిమాలు చేసిన మల్లికా ఆ తర్వాత చైనీస్, హాలీవుడ్ సినిమాల్లో నటించింది. విదేశాల్లో తెగ చక్కర్లు కొట్టి చాలా సినిమాల్లో నటించింది. జాకీచాన్ తోపాటు హాలీవుడ్ ప్రముఖ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో సైలెంట్ గా ఉంది. తాజాగా మల్లిక మరోసారి తెరపైకి వచ్చింది. 2009 జూన్ 23న అమెరికాలో […]

Written By: NARESH, Updated On : November 9, 2020 8:54 pm
Follow us on

మల్లికా శెరావత్.. ఒకప్పుడు తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. శృంగారతారగా పేరుగాంచింది. చాలా హాట్ హాట్ బాలీవుడ్ సినిమాలు చేసిన మల్లికా ఆ తర్వాత చైనీస్, హాలీవుడ్ సినిమాల్లో నటించింది. విదేశాల్లో తెగ చక్కర్లు కొట్టి చాలా సినిమాల్లో నటించింది. జాకీచాన్ తోపాటు హాలీవుడ్ ప్రముఖ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో సైలెంట్ గా ఉంది.

తాజాగా మల్లిక మరోసారి తెరపైకి వచ్చింది. 2009 జూన్ 23న అమెరికాలో కమలాతో బాలీవుడ్ నటి మల్లికా కలిసి ఫొటోలు తీయించుకుంది. కమలా అప్పుడు శాన్ ఫ్రాన్సిస్ కో డిస్ట్రిక్ అటార్నీగా పనిచేస్తున్నారు. అప్పుడే ఖచ్చితంగా కమలా ఉన్నతస్థాయికి ఎదుగుతారని .. ఎవ్వరూ ఊహించని పదవి చేపడుతారని మల్లికా చెప్పారు. ఆరోజు చెప్పిన జోస్యం నిజం కావడంతో మల్లిక దాన్ని మరోసారి గుర్తు చేసుకొని తనకు తానే పొగడ్తలు కురిపించుకుంది.

హీరోయిన్ మల్లికా శెరావత్ 11 ఏళ్ల క్రితం అప్పటి ప్రవాస భారతీయురాలు కమలా హ్యారిస్ అమెరికాలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని జోస్యం చెప్పింది. ఆ జోస్యం నిజంగానే నిజమై ఇప్పుడు కమలా అమెరికా ఉపాధ్యక్షురాలైంది.

దీంతో మల్లికా మళ్లీ ఆ పాత ట్వీట్ ను తెరమీదకు వచ్చి తన పాత డైలాగులను వల్లెవేసింది. ‘నేను ఆరోజు చెప్పిందే నిజమైందని.. నా టంగ్ గోల్డెన్ టంగ్’ అంటూ తనను తానే వెనకేసుకొచ్చింది. అంతేకాదు.. కమలా హ్యారిస్ తో మల్లికా శెరావత్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.