Ustaad Bhagat Singh DSP exit reasons: నేడు ఉదయం నిద్రలేవగానే మన అందరం ‘టాక్సిక్ ‘(Toxic Movie) మూవీ వాయిదా పడింది అనే వార్తతో లేచాము. ఇది నిజంగా చాలా పెద్ద షాక్ ఇచ్చే వార్త. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం ఇలా వాయిదా పడడం ఏంటి అంతా అనుకున్నారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల కారణంగానే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ షాకింగ్ న్యూస్ ని దిగమింగుకునేలోపే మరో షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడట. అంతే కాకుండా మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మార్చి 19 న విడుదల చేయబోతున్నారు అనే వార్త కూడా సంచలనం గా మారింది.
ఇదంతా పక్కన పెడితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి దేవి శ్రీ ప్రసాద్ ని తప్పించడం పై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది మా అభిమాన సంగీత దర్శకుడికి తీరని అవమానం. ‘సార్ జీ.. సార్ జీ అని పిలుస్తూ గట్టి దెబ్బనే వేశారు’ అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ తప్పుకోవడానికి గల కారణాలు ఇవే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసేశాడట. కానీ సెకండ్ హాఫ్ వర్క్ చాలానే పెండింగ్ లో ఉందట. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకోని ఉండుంటే , దేవి శ్రీ ప్రసాద్ నే కొనసాగించేవారు.
Also Read: 1800 కోట్ల రూపాయిలు నష్టపోయిన హీరో శివాజీ.. కారణం ఏంటంటే!
కానీ సినిమా ప్రీ పోన్ అవ్వడం తో మేకర్స్ దేవిశ్రీ కి బదులుగా తమన్ ని తీసుకున్నారట. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ ‘ మూవీ లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం ఆయన ఆ సినిమాకు డేట్స్ ని కేటాయించి ఉన్నాడు. ఇప్పుడు అందుబాటులో ఉండే అవకాశం లేనందున తమన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా దేవి శ్రీ ప్రసాద్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్యూన్స్ చాలా రొటీన్ గా ఉన్నాయని, పని కూడా ఆలస్యం అవుతుందని, ఆయన సకాలం లో డైరెక్టర్ కి, నిర్మాతలకు రెస్పాన్స్ ఇవ్వడం లేదని, అందుకే తప్పనిసిరి పరిస్థితి లో ఆయన్ని తప్పించాల్సి వచ్చిందే కానీ, ఆయన్ని అవమానించే ఉద్దేశ్యం లేదని సోషల్ మీడియా లో మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.