Most awaited movie of 2026: చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా మార్కెట్ మీదే కన్నేసారు. అందుకోసమే దానికి సంబంధించిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది హీరోలు మాస్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటే ప్రేక్షకులలో ఎక్కువ రీచ్ ఉంటుందనే నమ్ముతున్నారు. అందుకే వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అందించే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం గతంలో చేసిన సినిమాలతో సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ‘దసర’ సినిమా చేసినప్పటి నుంచి మాస్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సంవత్సరంలో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా సైతం ఈ సంవత్సరం రిలీజ్ కి సిద్ధమవుతుంది… ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతుంది.
Also Read: చిరంజీవి సినిమాలో విలన్ గా మోహన్ బాబు…
స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికి ప్యారడైజ్ సినిమా మీద మాత్రమే ప్రతి ఒక్కరికి భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలు పెరగడానికి గల కారణం ఏంటి అంటే నాని ఇందులో డిఫరెంట్ గా కనిపించడం ఒకెత్తయితే డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అనేది చాలా క్లారిటిగా అర్థమవుతుంది…
కాబట్టి ఈ సినిమా మీద ఆటోమేటిగ్గా క్రేజ్ అయితే పెరిగింది. ఇక ఈ సినిమాతో వచ్చే క్రేజ్ ను వాడుకొని నాని పాన్ ఇండియాలో తన సత్తా చాటుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే నాని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకుంటున్నట్టుగానే రాబోయే రోజుల్లో ఆయన టాప్ హీరోగా అవతరిస్తాడా..? టైర్ వన్ హీరోగా మారతాడా.? అనేది తెలియాల్సి ఉంది…