Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, యాష్మి గౌడ, ప్రేరణ, నిఖిల్, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, శేఖర్ భాషా, కిరాక్ సీత, నబీల్ అఫ్రిది… కంటెస్టెంట్స్ గా ఎంపిక అయ్యారు. కేవలం 14 మంది మాత్రమే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓంతో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ ఒకింత నిరాశ చెందారు.
ఇక సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మొదటివారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, సోనియా ఆకుల, పృథ్విరాజ్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఓటింగ్ లో అనూహ్య ఫలితాలు వచ్చాయట. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్. పాపులారిటీ ఉన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఆమెకు పెద్ద మొత్తంలో ఓట్లు పోల్ అయ్యాయట. నలభై శాతానికి పైగా ఓట్లు ఒక్క విష్ణుప్రియకే పోల్ అయ్యాయట. రెండో స్థానంలో నాగ మణికంఠ ఉండటం ఊహించని పరిణామం.
నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ అతని మీద విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. అయినప్పటికీ ఆడియన్స్ లో నాగ మణికంఠకు ఫాలోయింగ్ ఉందని ఓటింగ్ ఫలితాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో నాగ పంచమి సీరియల్ నటుడు పృథ్విరాజ్ ఉన్నాడట.
కాగా డేంజర్ జోన్లో సోనియా ఆకుల, బేబక్క, శేఖర్ భాషా ఉన్నారట. స్వల్ప ఓట్ల తేడాతో ఈ ముగ్గురు చివరి మూడు స్థానాల్లో ఉన్నారట. బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ప్రవర్తన, మాట తీరు పరిపక్వంగా ఉన్నాయి. ఏడుపులు, పెడబొబ్బలు వంటి డ్రామాలకు దూరంగా ఉంటుంది. ఆడియన్స్ లో ఆమెకుపాజిటివిటీ నెలకొంది. అదే సమయంలో సోనియా ఆకులపై కొంత నెగిటివిటీ ఉంది.
ఆడపులి అని తనకు తాను ఓ బిరుదు ఇచ్చుకున్న సోనియా ఆకుల.. కొంచెం ఓవరాక్షన్ చేస్తున్న భావన కలుగుతుంది. ఇక శేఖర్ బాషా తనదైన కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొందరు కుళ్ళు జోక్స్ అని ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఈ సీజన్ లో కామెడీ మీద దృష్టి పెట్టిన ఏకైన కంటెస్టెంట్ అని పొగుడుతున్నారు. మొత్తంగా బేబక్క, శేఖర్ భాషా, సోనియా ఆకుల లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.