spot_img
Homeఎంటర్టైన్మెంట్Mokshagna: ఎన్టీఆర్ సినిమాలో మోక్షజ్ఞ... బాలయ్య ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

Mokshagna: ఎన్టీఆర్ సినిమాలో మోక్షజ్ఞ… బాలయ్య ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

Mokshagna: బాలయ్య బాబు హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తే చాలు ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకమైతే ప్రేక్షకులందరిలో కలిగింది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలకు పెద్దగా బడ్జెట్ ని కేటాయించాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒకటి రెండు సార్లు బాలయ్య సినిమాని చూసి సూపర్ సక్సెస్ ని చేస్తారు. తద్వారా వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా ఈజీగా రికవరీ అయిపోతుంది. అనే ఒక కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరికి ఉంది… ఇలాంటి క్రమంలోనే తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సిన మోక్షజ్ఞ సైతం ఇప్పటివరకు సినిమాని చేయడం లేదు. కనీసం అతని సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్లడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికి అవేవీ వర్కౌట్ అయితే కావడం లేదు. మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు సైతం మోక్షజ్ఞ విషయంలో చాలావరకు లేట్ చేస్తున్నాడు అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మోక్షజ్ఞ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. డ్రాగన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ మధ్య పెద్దగా మాటలైతే లేవు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళకి మాటలు కలిసినట్టుగా తెలుస్తుంది…బాలయ్య ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడే మోక్షజ్ఞ గురించి చెప్పి మోక్షజ్ఞను డ్రాగన్ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నారట.

అంతకు ముందు నుంచే ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం ఎవర్నో ఒక్క హీరోను తీసుకుందామని జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడినప్పటికి ఇద్దరు ముగ్గురు మలయాళం హీరోలను తీసుకోవాలనే ప్రయత్నం చేశారట. దానికి జూనియర్ ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ విషయం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఎక్కడా కూడా బయటపడకూడదని ఒక నిబంధనతో వాళ్ళందరు వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి…ఈ వార్తల్లో నిజం ఉందా? లేదంటే కావాలని ఎవరైనా ఇలాంటి రూమర్ ని స్ప్రెడ్ చేశారా? అనేది తెలీదు గానీ మొత్తానికైతే వీళ్ళు కలిసిపోతే మాత్రం నందమూరి అభిమానులకు పండగనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper