Balakrishna And Mokshagna: నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధించాయి. అలాంటి బాలయ్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇలాంటి క్రమంలో సీనియర్ హీరోగా మారిన బాలయ్య నుంచి వచ్చే ప్రతి సినిమా 50 కోట్లకు పైన కలెక్షన్స్ ని కలెక్ట్ చేయడంతో తన అభిమానులు సైతం ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
ఇక ఈయన కెరియర్ గ్రాఫ్ చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నప్పటికి తన కొడుకు అయిన మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న కూడా అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.
కానీ అది ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు. ఇక దానితో ప్రశాంత్ వర్మ పక్కన పెట్టిన బాలయ్య రీసెంట్ గా మరికొద్ది మంది దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే 2026వ సంవత్సరంలో మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 2027 వ సంవత్సరంలో ఈ సినిమాని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఏమైనా కూడా బాలయ్య బాబు ఆలోచిస్తున్నా ధోరణి బాగుంది.
మొత్తానికైతే తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి టాప్ హీరో మార్చాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు. అతను అనుకున్నట్టుగానే మోక్షజ్ఞ టాప్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. మరి ఆ పోటీని తట్టుకొని నిలబడే కెపాసిటి మోక్షజ్ఞ కి ఉండాలి. లేకపోతే మాత్రం ఆయన తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశాలైతే ఉన్నాయి…