https://oktelugu.com/

Mohan Babu: మోహన్ బాబు తలకు గాయం..కన్నీళ్లు రప్పిస్తున్న హాస్పిటల్ విజువల్స్..మంచు మనోజ్ పై మండిపడుతున్న అభిమానులు!

పరువు కోసం ప్రాణాలను సైతం ఇచ్చే మనస్తత్వం ఉన్న మోహన్ బాబు, మనోజ్ చేస్తున్న ఈ పనులపై మనస్తాపం చెందుతూ నిన్న విడుదల చేసిన ఒక ఆడియో ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 09:34 AM IST

    Mohan Babu(3)

    Follow us on

    Mohan Babu: మంచు కుటుంబం లో వివాదం రోజురోజుకి ముదురుతూ, చూసే జనాలకు చాలా చిరాకు రప్పించే విధంగా మారింది. మీ కుటుంబంలోని సమస్యల గురించి మాకెందుకు, రోజు మాకేంటి ఇది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు. ఆస్తి విషయంలో మంచు మనోజ్ కి న్యాయం జరగలేదని, ఆయన తన తండ్రి మోహన్ బాబు పై, అన్నయ్య విష్ణు పై చాలా కాలం నుండి అసంతృప్తి తో ఉన్నాడు. గత ఏడాది మంచు విష్ణు, మనోజ్ ఇంటికి వచ్చి గొడవ పడడం, దానికి సంబంధించిన వీడియో ని మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం వంటివి జరిగాయి. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. మళ్ళీ గొడవ సర్దుకుందిలే అని అంతా అనుకున్నారు. మళ్ళీ రెండు రోజుల నుండి ఈ కుటుంబ వివాదాలు పబ్లిక్ వరకు వచ్చింది.

    పరువు కోసం ప్రాణాలను సైతం ఇచ్చే మనస్తత్వం ఉన్న మోహన్ బాబు, మనోజ్ చేస్తున్న ఈ పనులపై మనస్తాపం చెందుతూ నిన్న విడుదల చేసిన ఒక ఆడియో ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా నిన్న సాయంత్రం తన కూతురుని తీసుకొని వెళ్లేందుకు వచ్చిన మనోజ్ ని మోహన్ బాబు సెక్యూరిటీ ఆపడం, దాంతో ఆగ్రహించిన మనోజ్ ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్లడం, వాటికి సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియా లో చూడడం వంటివి జరిగాయి. ఈ సంఘటనలను మొత్తం చిత్రీకరించడానికి మన తెలుగు మీడియా మొత్తం నిన్న మోహన్ బాబు ఇంటి వద్దనే తిష్టవేసి లైవ్ కవరేజ్ ఇచ్చింది. నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ రిపోర్టర్ మోహన్ బాబు వద్దకు వెళ్లి, మైక్ పట్టుకొని ‘సార్ చెప్పండి’ అనడం, ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు ‘ఏంట్రా చెప్పేది..నీ అమ్మ’ అంటూ దూషిస్తూ కొట్టడం వంటివి చూసాము.

    ఈ ఘటనలో తోపులాట జరిగింది. మోహన్ బాబు కి గాయాలు అవ్వడంతో ఆయన్ని హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు. మనోజ్ తప్ప మోహన్ బాబు కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్ లోనే ఉన్నారు. సింహం లాగా ఎంతో గంభీరంగా ఉండే మోహన్ బాబు, అలా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్న విజువల్స్ ని చూసి ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అతనికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన మంచు మనోజ్ పై మండిపడుతున్నారు. ఈ వయస్సులో మోహన్ బాబు కి ఇలాంటి మానసిక క్షోభ ని ఎందుకు కలిగిస్తున్నావు అంటూ నిలదీస్తున్నారు. నిన్న మోహన్ బాబు ఆడియో రికార్డు విడుదల చేయకముందు ఈ ఘటనపై నెటిజెన్స్ లో మంచు మనోజ్ పై సానుభూతి ఉండేది. కానీ ఆడియో రికార్డు విన్న తర్వాత మోహన్ బాబు లోని ఆవేదనలో నిజాయితీ కనిపించింది. ఇన్ని రోజులు కస్టపడి సంపాదించుకున్న పరువు మోతన్ని కొడుకు రోడ్డున పెట్టాడనే ఆవేదన నెటిజెన్స్ కి అర్థం అవ్వడంతో మోహన్ బాబు పై ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారు.