https://oktelugu.com/

Tollywood and Bollywood : బాలీవుడ్ ను తొక్కేసిన టాలీవుడ్…ఇది అసలు ఎవ్వరూ ఊహించలేదుగా…

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్ళకే మంచి గుర్తింపు అయితే ఉంటుంది. అయితే భారీ సక్సెస్ ని వాళ్ళు ఇక నెంబర్ వన్ గా కొనసాగుతారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 09:42 AM IST

    Tollywood , Bollywood

    Follow us on

    Tollywood and Bollywood : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్ళకే మంచి గుర్తింపు అయితే ఉంటుంది. అయితే భారీ సక్సెస్ ని వాళ్ళు ఇక నెంబర్ వన్ గా కొనసాగుతారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. ఇక బాలీవుడ్ వాళ్ళు చేస్తున్న సినిమాలేవీ అంత పెద్ద సక్సెస్ లనైతే సాధించడం లేదు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి బాలీవుడ్ ను మనవాళ్ళు డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఇక రాజమౌళి సృష్టించిన ఈ పెను ప్రభంజనాన్ని మన దర్శకులు కంటిన్యూ చేస్తూ రావడమే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి తర్వాత వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా పుష్ప, త్రిబుల్ ఆర్, సా, కల్కి 2 వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ మేకర్స్ కి సైతం చెమటలు పట్టించేలా చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక ఇప్పుడు మన ఇండస్ట్రీకి మంచి గుర్తింపైతే వస్తుంది. మన సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుండడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మన సినిమా స్థాయి అనేది వరల్డ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది.

    మరి రాజమౌళి లాంటి దర్శకుడు ఇంకా ముందు ముందు భారీ ప్రయోగాలు చేసి మన తెలుగు సినిమా స్థాయిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కోరుకుందాం…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని టచ్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఏ ఇండస్ట్రీ వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. నిజానికి వాళ్లు తీసినవే సినిమాలు, వాళ్ళు చెప్పిందే కలెక్షన్స్ అన్నట్టుగా వాళ్ళ హవా అయితే కొనసాగింది.

    కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడంతో వాళ్ల పప్పులు ఏమి ఉడకడం లేదు. అసలు వాళ్ళు ఎలాంటి సినిమా చేస్తే సక్సెస్ వస్తుందా? అనే డైలమాలోనే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే పొరపాటున ఆ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం మన వాళ్ల ముందు వాళ్ళు తగ్గి ఉండాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.

    అందువల్లే అమీర్ ఖాన్ లాంటి హీరోలు ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ లో పడి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా ఇంకో పది పదిహేను సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి…