Mohan Babu Son Of India Collections: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది.

353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే ఉంది.
Also Read: చరణ్ ఎమోషనల్ ట్వీట్ పై ప్రశంసల వర్షం
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 11 లక్షల రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ఇక సెకండ్ డే కలెక్షన్స్ ను బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్ చేసుకోకపోగా, కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉంటున్నాయి.

ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్లు ఇలా ఉండే అవకాశం ఉంది :
నైజాం 2 లక్షలు,
సీడెడ్ 3 లక్షలు,
ఆంధ్రా : 2.5 లక్షలు,
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2 లక్షలు.
ఓవరాల్ గా మొత్తం రెండు రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా 22 లక్షలను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉంది.
ఓవరాల్ గా మోహన్ బాబు కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రం.
Also Read: ఊర మాస్ లుక్ లో బాలయ్య.. మళ్ళీ ఫ్యాన్స్ కు పూనకాలే !
[…] […]
[…] China killing Indian donkeys: కాదేదీ చైనీయుల ఆహారానికి అనర్హం అన్నట్టు పరిస్థితి మారింది. కప్పలు , పీతలు, పాములు, ఎలుకలు, సమస్త భూరాశిపై ఉన్న అన్ని జంతువులను వాళ్లు తినేస్తుంటారు. దరిద్రం ఏంటంటే.. ఆఖరుకు గబ్బిలాలు కూడా తింటారు. ఆ గబ్బిలాల వల్లే ప్రపంచానికి కరోనా అంటిందన్న ఆరోపణలు ఉన్నాయి. అది నిగ్గు తేల్చాల్సి ఉంది. చైనీయుల ఆహార, సౌందర్య అలవాట్ల కారణంగానే ప్రపంచంలో కొత్త వైరస్ లు, కొన్ని జాతులు అంతరించి పోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భారతదేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోవడానికి కూడా చైనీయులే కారణమంటే నమ్మగలరా? కానీ ఇది నిజంగా నిజం. దేశంలో గాడిదల సంఖ్య తగ్గడం వెనుక చైనా హస్తం ఉన్నట్లు తాజా అధ్యయనం నిగ్గుతేల్చింది. […]
[…] Also Read: Mohan Babu Son Of India Collections: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్ … […]