Pawan Kalyan Bheemla Nayak: పవన్ సినిమా వస్తుందంటేనే బాక్సాఫీస్ కొత్త లెక్కలను తయారు చేసుకుంటుంది. ఇప్పటికే అన్ని సెంటర్లు భీమ్లా నాయక్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సాంగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టించిన భీమ్లా నాయక్.. రిలీజ్ పోస్టర్లలో రాణాను కూడా చూపించి అంచనాలు పెంచేసింది. అయితే ముందు రిస్క్ ఉన్నా సరే.. భీమ్లా నాయక్ మాత్రం అస్సలు భయపడట్లేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దూకుతున్నాడు.
ఇక త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేయబోతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. పుష్ప తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే. కాబట్టి దీని కోసం సినీ లవర్స్ తో పాటు పవన్, రాణా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్‌కు ఉన్న పెద్ద ఫ్యాన్ బేస్ ఈ మూవీకి అతిపెద్ద ఆస్తి. కాబట్టి యావరేజ్ గానే ఈ మూవీ చాలా పెద్ద బిజినెస్ చేస్తోంది.
అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లు వసూలవుతాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. అటు రాణాకు కూడా ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి అది కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక ఏపీలో కూడా మరో వారంలోపు కొత్త జీవో వస్తుంది. అలాగే 100 శాతం ఆక్యుపెన్సీకి కూడా పర్మిషన్ వస్తుందని ప్రొడ్యూసర్లు అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుని కలెక్షన్ల లెక్కలు కడుతున్నారు.
Also Read: చరణ్ ఎమోషనల్ ట్వీట్ పై ప్రశంసల వర్షం
ఇప్పటికే ఏపీలో B అండ్ C సెంటర్లలో అన్ని టికెట్లు అమ్ముడు పోతున్నాయి. ఇక వపన్ సినమా రోజే శర్వానంద్, వరుణ్ తేజ్ మూవీలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వీటితో కొంత పోటీ తప్పేలా లేదు. ఇక ఓవర్సీస్ లో అజిత్ మూవీ వలిమై గట్టి పోటీనిస్తోంది. కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లోనూ పోటీ ఎదురవుతోంది. మరి ఇందులో పవన్ సినిమాకు రిజిస్టర్ అయ్యే థియేటర్లు ఎన్ని అనేది తెలియాల్సి ఉంది. సినిమా గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సినిమా పడితే పవన్ ఏ రేంజ్ లో దుమ్ములేపుతాడో ఇప్పటికే చూశాం. మరి ఈ భీమ్లా నాయక్ ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.