Homeఎంటర్టైన్మెంట్Viral Photo: వైరల్ ఫోటో డెలివిరీ బాయ్ గా మారిన ఈ హాస్య నటుడిని గుర్తుపట్టగలరా...

Viral Photo: వైరల్ ఫోటో డెలివిరీ బాయ్ గా మారిన ఈ హాస్య నటుడిని గుర్తుపట్టగలరా ?

Viral Photo: బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా పలు సినిమాలు, షోల ద్వారా మెప్పించి కపిల్ శర్మ షోతో అతడు పాపులర్ అయ్యాడు. తన హాస్యంతో అందరినీ కడుపుబ్బా నవ్వించడం కపిల్ శర్మ ప్రత్యేకత. తాజాగా కపిల్ శర్మ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అతడు డెలివరీ బాయ్ గెటప్‌లో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు.

ఈ ఫోటోలో కపిల్ శర్మ ఓ కంపెనీకి చెందిన పసుపు రంగు టీ షర్టును ధరించి బైక్‌పై కూర్చున్నాడు. వెనకాల బ్లూ కలర్ బ్యాగ్ వేసుకున్నాడు. అంతే కాకుండా తన ఎడమ చేతికి వాచీ పెట్టుకుని నల్లటి హెల్మెట్ ధరించి ఉన్నాడు. సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఇలాంటి బ్యాగ్‌లు వెనుక తగిలించుకుని ఆహారాన్ని పంపిణీ చేస్తారు.

Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్

అయితే కపిల్ శర్మ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుండగా అందులో డెలివరీ బాయ్ పాత్రలో భాగంగా ఇలా కనిపించడానికి కారణమని టాక్ నడుస్తోంది. హీరోయిన్ నందితా దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో కపిల్ శర్మ డెలివరీ బాయ్‌గా పనిచేసి జీవనోపాధి పొందుతాడని తాజా ఫోటో ద్వారా అర్థమవుతోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని తెలుస్తోంది.

Viral Photo
Viral Photo

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను సరిగ్గా గమనిస్తే ఎడమ వైపున కారులో ఉంచిన కెమెరా కూడా కనిపిస్తుంది. దాని డోర్ వెనుక నుంచి తెరిచే ఉంటుంది. కెమెరామెన్ అక్కడ నుంచి కెమెరాను ఆపరేట్ చేస్తుండటం కూడా గమనించవచ్చు. కపిల్ శర్మ నటిస్తున్న ఈ మూవీలో సహానా గోస్వామి హీరోయిన్‌గా నటిస్తోంది. వివిధ భాషల్లో హీరోయిన్‌గా నటించిన నందితా దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

Also Read: పునీత్, సుశాంత్.. చనిపోయాక హిట్స్ కొట్టిన హీరోలు వీళ్లే
Recommended Videos
Singer Sravana Bhargavi and Hemachandra Divorce || HemaChandra Sravana Bhargavi Latest News
రావు గోపాలరావు కి స్టార్ హీరోలు అలా చేశారా? || Did star heroes do that to Rao Gopalrao
Megastar Chiranjeevi Imitates Rao Gopal Rao || Chiranjeevi Comedy Timing || Pakka Commercial
Vaishnav Tej Reveals His Real Age || Ranga Ranga Vaibhavanga Teaser Launch || Oktelugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్.. అనారోగ్య కారణాలతో స్పెయిన్​కు వెళ్లారు. అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఆపరేషన్​ అయినప్పటికీ డాక్టర్లు ప్రభాస్​ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సలార్​ చిత్ర షూటింగ్​లో గాయపడ్డారు ప్రభాస్. […]

  2. […] Bigg Boss OTT Telugu Elimination: బిగ్ బాస్.. ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ కూడా అయింది. ఇక ఈ వారం సీన్ క్లైమాక్స్‌కు చేరింది. ఫస్ట్ రెండు వారల్లో ఎవరూ ఊహించనట్టుగా గ్లామరస్ బ్యూటీస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ఇంక్లా క్లారిటీ రాలేదు. తాజా పరిణామాలను గమనిస్తే ఓటింగ్స్ లోనూ తేడాలు కనిపించాయి. […]

Comments are closed.

Exit mobile version