Mogali Rekulu Sagar controversy: మొగలిరేకులు(Mogalirekulu) సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాగర్(Sagar).అనంతరం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో హీరో ఫ్రెండ్ రోల్ చేశాడు సాగర్. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ దర్శకుడు దశరథ్ తనను మోసం చేశాడని సాగర్ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోసారి సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశాడు. ఆ సినిమా చేయడమే తాను చేసిన అతిపెద్ద తప్పు అన్నారు. నిజానికి దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో తనది సెకండ్ లీడ్ అని చెప్పాడట. సాగర్ 15 రోజులు డేట్స్ ఇచ్చాడట.
Also Read: వచ్చే వారం ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!
షూటింగ్ మొదలై మూడు రోజులు అవుతున్నా తనను పిలవలేదట. అనుమానం వచ్చి అడిగితే రేపు నీ సీన్స్ ఉంటాయని చెప్పారట. తనపై రెండు సీన్స్ మాత్రమే షూట్ చేశారట. నాది నిజంగా సెకండ్ లీడేనా? అని దశరథ్ ని సాగర్ అడిగాడట. ఒక్కోసారి పాత్రలు మారిపోతాయి. లైట్ తీసుకోమన్నారట డైరెక్టర్. దాంతో తనకు చెప్పింది ఇది కాదు కదా, నా పాత్రను తీసేయండి. మరొక పాత్రను హైలెట్ చేసుకోండని దర్శకుడితో సాగర్ అన్నారట. అయినా తన సన్నివేశాలు తొలగించలేదట. మూవీ విడుదలయ్యాక అలాంటి పాత్ర చేశావేంటి అని మిత్రులు అన్నారట.
మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తన కెరీర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిందని .. సాగర్ అన్నాడు. అలాగే రంగస్థలం మూవీలో ఆదిపినిశెట్టి చేసిన పాత్ర సాగర్ చేయాల్సింది అట. మొదట ఆ ఆఫర్ తనకే వచ్చిందట. మిస్టర్ పర్ఫెక్ట్ అనుభవం రీత్యా అలానే జరుగుతుందేమో అని చేయనని సాగర్ అన్నారట. ఆదిపినిశెట్టి కూడా మొదట రిజెక్ట్ చేశాడట. ఇద్దరూ మరలా ఒకేసారి ఓకే చేశారట. ఆదిపినిశెట్టి డైరెక్టర్ సుకుమార్ కి ఫోన్ చేసి అంగీకారం తెలపడంతో ఆయన్ని తీసుకున్నారట. ఆ విధంగా రంగస్థలం మిస్ అయ్యిందని సాగర్ అన్నారు.
Also Read: మహేష్ బాబు,రాజమౌళి చిత్రానికి సరికొత్త చిక్కులు..ఇలా అయితే కష్టమే!
షాదీ ముబారక్ మూవీతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న సాగర్ కి మరలా గ్యాప్ వచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ ‘ది 100‘. ఈ చిత్రం జులై 11న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాగర్ ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.