Miss Shetty Mr Polishetty First Review: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ ఫస్ట్ రివ్యూ

నవీన్ పోలిశెట్టి గతంలో ‘జాతిరత్నాలు’ సినిమాతో స్టార్ అయ్యాడు. ఆ తరువాత మళ్లీ ఇందులోనే నటించారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న నటులు కలిసి నటించి మిస్ శెట్టి.

Written By: Chai Muchhata, Updated On : September 7, 2023 9:29 am

Miss Shetty Mr Polishetty First Review

Follow us on

Miss Shetty Mr Polishetty First Review: సౌత్ సూపర్ స్టార్ అనుష్కకు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. వెండితెరపై అనుష్క కనిపిస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ అనుష్క మాత్రం బాహుబలి సినిమాల తరువాత వెండితెరపై తక్కువగా కనిపిస్తోంది. బాహుబలి తరువాత అనుష్క హీరోయిన్ రేంజ్ లో కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ గానే నటిస్తోంది. ఈ తరుణంలో ఆమె నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న గురువారం థియేటర్లోకి వచ్చింది. ఇందులో హీరోగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించి అలరించాడు. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

నవీన్ పోలిశెట్టి గతంలో ‘జాతిరత్నాలు’ సినిమాతో స్టార్ అయ్యాడు. ఆ తరువాత మళ్లీ ఇందులోనే నటించారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న నటులు కలిసి నటించి మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి పై అంచనాలు అంతో ఇంతో ఉన్నాయి. ఈ తరుణంలో సినిమా చూసిన చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఫస్ట్ ఆఫ్ సినిమా కాస్త స్లోగా రన్ అవుతుంది. సెకండాఫ్ మాత్రం కామెడీతో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నవీన్ శెట్టి మరోసారి తన హీరోయిజాన్ని నిరూపించాడు. మొత్తంగా కామెడీ, ఎమోషన్స్ ప్రేక్సకులను ఆకట్టుకుంటాయి.

డైరెక్టర్ మహేష్ బాబు స్టోరీ లైన్ ఎంచుకోవడం బాగుంది. కాకపోతే ఆయన తీసుకున్న పాయింట్ నార్మల్ పీపుల్స్ అర్థం కాకపోవచ్చు. సిటీలో ఉండేవాళ్లు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. కొన్ని ఎమోషన్స్ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇక సినిమా వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. హై రిచ్ లో సినిమాను నిర్మించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని వర్గాలను ఆకట్టుకున్నా.. పాటలు మాత్రం ఎవరినీ మెప్పించలేకపోయాయి. మొత్తంగా సినిమా స్లో రన్ సాగుతున్నా.. లవ్ ఎమోషన్లు బెటర్ అనిపిస్తాయి.