https://oktelugu.com/

G20 Summit 2023: జీ-20 సందడి షురూ.. ఇంతకీ చైనా అధ్యక్షుడు ఎందుకు రానట్టు?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారమే అమెరికా నుంచి బయలుదేరుతారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చర్చలు జరుపుతారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 7, 2023 / 09:25 AM IST

    G20 Summit 2023

    Follow us on

    G20 Summit 2023: భారత్ అధ్యక్షతన ఈనెల 8 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జి20 సదస్సు సర్వం సిద్ధమైంది. గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్న క్రమంలో భారత్ ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, వాతావరణ మార్పులు, తదితర కీలకమైన సమస్యలపై ఈ సదస్సులో చర్చిస్తారు. వీరిలో పలువురు ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

    వచ్చేది వీరే

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారమే అమెరికా నుంచి బయలుదేరుతారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయన ప్రయాణానికి సంబంధించి ముందు జరిపిన కోవిడ్ పరీక్షలో నెగిటివ్ ఫలితం వచ్చింది. భార్య జిల్ బైడెన్ కు మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా సదస్సుకు హాజరవుతున్నారు. భారత సంతతికి చెందిన ఆయన బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ లో చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ , కెనడా ప్రధానమంత్రి ట్రుడో.. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తారు. జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్, జపాన్ ప్రధాని పుమియో కిశిద, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్_ సుక్_ యేవో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రాన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

    ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి సంబంధించి ఈ సదస్సులో జరిపే చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిని జపాన్ అధ్యక్షుడు ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమ ఫొస జి_ 20 గ్రూపులో భారత అధ్యక్షతకు పూర్తి మద్దతు ప్రకటించారు. వీరితోపాటు పలు దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశ ఆహ్వానం మేరకు పరిశీలకుల హోదాలో సదస్సులో పాల్గొంటారు. ఉక్రెయిన్ యుద్ధ నేరాలకు సంబంధించిన అంతర్జాతీయ నేరం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది జి20 సదస్సుకు హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గిలావ్ రోవ్ ను జీ 20 సదస్సుకు పంపుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా సదస్సుకు హాజరవడం లేదు. ఆయన స్థానంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ను జి 20 సదస్సుకు పంపుతున్నారు. అయినా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాకపోవడంతో.. ఆయన స్థానంలో ప్రధాని లీ ఖియాంగ్ వస్తున్నారు. 2008 నుంచి జీ20 సదస్సులు నిర్వహిస్తుండగా.. చైనా అధ్యక్షుడు గైర్హాజరవడం ఇదే తొలిసారి. ఇక యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్ లియోన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సదస్సుకు హాజరయ్యేది ఇంకా నిర్ధారణ కాలేదు. మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపేజ్ ఓబ్రాడార్ ఏడాది జి20 సదస్సుకు హాజరుకాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియోమలోని, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో కూడా జీ20 సదస్సు కు హాజరయ్యే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఈ సదస్సును దృష్టిలో పెట్టుకొని దేశ రాజధాని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.