Project K : బచ్చన్ మిస్… శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రభాస్-కమల్!

అమితాబ్ బచ్చన్ సైతం శాన్ డియాగో వెళ్లాల్సి ఉంది. ఆయన అనివార్య కారణాలతో హాజరు కాలేదు. కమల్, ప్రభాస్ లతో అమితాబ్ జాయిన్ అయితే హిస్టారికల్ మూమెంట్ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Written By: Shiva, Updated On : July 20, 2023 6:24 pm
Follow us on

Project K : కెరీర్లో మొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రంలో ఆయన సూపర్ హీరోలా కనిపించనున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శాన్ డియాగో కామిక్ కాన్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. కామిక్ కాన్ కి ఎంపికైన మొదటి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే ఘనత సాధించింది. విడుదలకు ముందు ప్రాజెక్ట్ కే ఓ ఘనత అందుకుంది. 

 
శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ నేడు ప్రారంభమైంది. జులై 23 వరకు జరగనుంది. ప్రాజెక్ట్ కే చిత్ర యూనిట్ అంతర్జాతీయ సినిమా వేదికపై సందడి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే హీరో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, నిర్మాత అశ్వినీ దత్ ప్రఖ్యాత ఈవెంట్ కి హాజరయ్యారు. లోకనాయకుడు కమల్ హాసన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇద్దరు బడా ఇండియన్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
అమితాబ్ బచ్చన్ సైతం శాన్ డియాగో వెళ్లాల్సి ఉంది. ఆయన అనివార్య కారణాలతో హాజరు కాలేదు. కమల్, ప్రభాస్ లతో అమితాబ్ జాయిన్ అయితే హిస్టారికల్ మూమెంట్ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ దీపికా పదుకొనె సైతం పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఆమె కూడా హాజరుకాలేదు. ఇక కామిక్ కాన్ ఈవెంట్ వేదికపై ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
జులై 20న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానున్నాయి. భారత కాలమానం ప్రకారం జులై 21న మనకు అందుబాటులోకి వస్తాయి. ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ తో ప్రభాస్ ఆసక్తి రేపిన తరుణంలో ఫస్ట్ ప్రోమో ఎలా ఉండనుందనే ఉత్కంఠ పెరిగింది. వచ్చే ఏడాది జనవరిలో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రమోషన్స్ ఆల్రెడీ షురూ చేశారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.