https://oktelugu.com/

BRO – Baby Theaters : ‘బ్రో ది అవతార్’ కి ‘బేబీ’ గండం..ఇలా అయితే ఇక కష్టమే!

ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఒక రోజు 'బేబీ ' చిత్తాన్ని వాయిదా వేస్తే మాత్రం నిర్మాత SKN ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితాంతం రుణపడి ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : July 20, 2023 / 06:16 PM IST
    Follow us on

    BRO – Baby Theaters : జులై 14 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన చిన్న సినిమా ‘బేబీ’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి రోజు ప్రారంభమైన ఈ వసూళ్ల సునామి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలు కూడా మొదటి వెకెండ్ తర్వాత స్టడీ గా కలెక్షన్స్ ని రాబట్టడం కష్టమైన ఈ రోజుల్లో, ఒక చిన్న సినిమా రోజుకు సగటున రెండు కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లను సాధించడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు.రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ చిత్రానికి కూడా ఇలాంటి వసూళ్లు మొదటి వీకెండ్ తర్వాత నమోదు అవ్వలేదు. అలాంటిది ఈ చిత్రం ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే జనాల్లో ఈ సినిమాకి ఉన్న టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    అయితే ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏమి విడుదల అవ్వకపోవడం వల్ల ‘బేబీ’ చిత్రానికి ఎలాంటి ఢోకా లేదు. కానీ వచ్చే వారం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. ఆదివారం, లేదా సోమవారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వబోతున్నాయి. ఇది ఇలా ఉండగా ‘బేబీ’ చిత్రానికి కేటాయించిన థియేటర్స్ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి ఇవ్వరట.

    సినిమాకి   అద్భుతమైన కలెక్షన్స్ వస్తుండడం తో మరో రెండు వారాలు బలమైన రన్ ఉండే ఛాన్స్ ఉన్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్టు. అయితే ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. వాళ్ళు తమ అభిమాన హీరో కోసం మొదటి రోజు తమ బేబీ సినిమాని ఆపుకుంటారా..? , లేదా తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే ధీరణిలో ఉంటారా  అనేది చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఒక రోజు ‘బేబీ ‘ చిత్తాన్ని వాయిదా వేస్తే మాత్రం నిర్మాత SKN ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితాంతం రుణపడి ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.