Mirai making video: ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్ ని ఏ రేంజ్ లో ఉపయోగిస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కొన్ని సినిమాలు కేవలం గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే వాయిదాలు పడుతున్నాయి. వందల కోట్లు గ్రాఫిక్స్ కోసమే వినియోగిస్తున్నారు కానీ, దానికి తగ్గ క్వాలిటీ ఔట్పుట్ మాత్రం రావడం లేదు. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘హరి హర వీరమల్లు’. ఆ చిత్ర నిర్మాత AM రత్నం ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు ఖర్చు చేశాము అని ఆ సినిమా విడుదలకు ముందు ప్రతీ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చేవాడు. కానీ సినిమా విడుదల అయ్యాక సెకండ్ హాఫ్ లో ఆ గ్రాఫిక్స్ ని చూసిన వాళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. కనీసం పాతిక కోట్లు కూడా ఖర్చు చేసినట్టుగా అనిపించలేదు. ఇకపోతే మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న తేజ సజ్జ(Teja Sajja) ‘మిరాయ్'(Mirai Movie) మూవీ టీజర్, ట్రైలర్ ని మనమంతా చూసే ఉంటాము.
ట్రైలర్ లో VFX కంటెంట్ ఎంత క్వాలిటీ తో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే తేజ సజ్జ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దీని గురించి మాట్లాడుతూ ‘ట్రైలర్ లో మీరు చూసిన కంటెంట్ మొత్తం VFX కాదు, లైవ్ లొకేషన్స్ లోకి వెళ్లి చిత్రీకరించాము. అందుకే మాకు ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవ్వలేదు. VFX ఉపయోగించాము కానీ, చాలా తక్కువ, అసలు ఒక్క సన్నివేశానికి కూడా మేము గ్రీన్ మ్యాట్ వాడలేదు. ఎవరో మొన్న ట్రైలర్ ని ట్రైన్ VFX షాట్స్ సరిగా బాగాలేవని అన్నాడు. అది అసలు VFX నే కాదు, లైవ్ గా నేను చేసిన యాక్షన్ సన్నివేశం. దానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఉంది, త్వరలోనే విడుదల చేస్తాం’ అని అన్నాడు.
ఇచ్చిన మాట ప్రకారమే కాసేపటి క్రితమే ఆ మేకింగ్ వీడియో ని విడుదల చేశాడు. ఇందులో తేజ సజ్జ ట్రైన్ మీద నిల్చొని ఫైట్ చేయడం, ట్రైన్ మీద పరుగులు తీయడం, ట్రైన్ ఇంజిన్ మీద నిలబడడం, ఇలా ఎన్నో షాట్స్ ని ఒరిజినల్ గా చేసేవి చూపించారు. దెబ్బకు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. చిన్న చిన్న ఫైట్ షాట్స్ కూడా చెయ్యలేక డూప్స్ ని వాడుతున్న ఈ రోజుల్లో ఇంతటి రిస్కీ షాట్స్ ని అంత ధైర్యం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ సినిమా కోసం తేజ సజ్జ ఎంత కష్టపడ్డాడో కళ్ళకు కనిపిస్తూనే ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Real Effort, Real Blood & Sweat
– ❤️#MIRAI BTS Part 3GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER
Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg #KrithiPrasad @peoplemediafcy… pic.twitter.com/PE1d39ibjk
— Teja Sajja (@tejasajja123) September 10, 2025