Health effects of Alarm: ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి వ్యక్తికి ఎన్నో రకాల పనులు ఉంటాయి. కొందరు ఇంట్లో ఉండి.. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చక్కబెడితే.. మరికొందరు ఫీల్డ్ లోకి వెళ్లి పనులు చేసేవారు ఉంటారు. ఎవరు ఏ పనులు చేసిన సమయాన్నికూలంగా చేస్తేనే వాటికి విలువ ఉంటుంది. సమయం తప్పితే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలా ప్రతిదీ టైం టు టైం చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రణాళిక సక్సెస్ కావాలంటే ఉదయం సరైన సమయానికి నిద్రలేవాలి. ఇలా ఎవరికివారు సరైన సమయానికి నిద్ర లేవాలంటే సాధ్యం కాదు. దీంతో కొందరు అలారం పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ అలారం వల్ల ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో తెలుసా?
ఉదయం లేవగానే స్కూలుకు.. కార్యాలయాలకు.. వ్యాపార సంస్థలకు వెళ్లాలని అనుకునే వారికి తొందరపాటు ఉంటుంది. అయితే కాస్త ముందుగా నిద్రలేస్తే ఈ తొందరపాటు ఉండదు. అలా ముందుగా నిద్ర లేవడానికి చాలామంది అలారం పెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది ఫోన్లో అలారం పెట్టుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు అలారం వాచ్ ను ఉపయోగించేవారు. దీని ద్వారా బిగ్గరగా సౌండ్ వచ్చి నిద్ర లేస్తారు. అయితే ఈ అలారం వల్ల చాలామందికి అనేక అనారోగ్య సమస్యలు ఉంటున్నాయని కొన్ని పరిశోధనలు తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ వర్జినియాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో పరిశోధకుడు కిమ్ తెలిపిన ప్రకారం.. సాధారణంగా నిద్రలేచే వారిలో కంటే అలారంతో నిద్రలేచే వారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వీరిలో సాధారణ పౌరుల కంటే 74% అధికంగా గుండె సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రతిరోజు అలారం పెట్టుకుని నిద్ర లేచే వారిలో హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలారం శబ్దం వల్ల శరీరంలో ఏదో అలజడి జరిగి గుండె ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే ప్రతిరోజు అలారం వినడం వల్ల మానసికంగా ఆందోళన ఉంటుందని తెలుపుతున్నారు.
అయితే అలారం లేకుండా చాలామందికి నిద్ర లేవడం కష్టంగా మారుతుంది. అయితే ఈ అలారం కాస్త మృదువైన సంగీతంలా ఉంటే బాగుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. కఠినమైన శబ్దం వల్ల గుండెకు ఎప్పటికైనా తీవ్రమైన సమస్యలనే పరిగణించబడుతుందని అంటున్నారు. ఇంకొందరు మాట్లాడుతూ అలారం లేకుండా నిద్రలేచే ప్రయత్నం చేయాలని అంటున్నారు. కొన్ని రోజులపాటు ఇది కష్టంగా ఉన్నా.. ఆ తర్వాత అలవాటుగా మారుతుందని అంటున్నారు. అలా అలవాటు కావాలంటే రాత్రిళ్ళు ఆలస్యం చేయకుండా ముందుగానే నిద్రపోవాలి. అలా తొందరగా నిద్రపోతేనే ఉదయం అనుకున్న సమయానికి నిద్ర లేస్తారు. లేకుంటే కేవలం అలారం ఉంటేనే నిద్రలేచే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయమే ఇలాంటి కఠోరమైన అలారం శబ్దం వినడం వల్ల రోజంతా నెగటివ్ ఎనర్జీ ప్రసారమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల అలారంతో నిద్రలేచే అలవాటును మానుకోవాలని పరిశోధకులు తెలుపుతున్నారు.