https://oktelugu.com/

Rajinikanth : ఇద్దరు’ సినిమా చేయకూడదని రజినీకాంత్ ను బెదిరించిన వ్యక్తులు ఎవరు..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు మణిరత్నం...తమిళ్, తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలను చేసి దర్శకుడి గా తన సత్తాను చాటుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 02:39 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం కు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు సగటు ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలను తీసిన మొదటి దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఆయన చేసిన ప్రతి సినిమా ఒక వైవిధ్యానైతే సంతరించుకొని ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఒక ఫ్లేవర్ అయితే ఉంటుంది. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేక మైన క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ఇక ఇది లా ఉంటే తమిళనాడు పొలిటికల్ వార్ ను బేస్ చేసుకొని ఆయన చేసిన ఇద్దరు సినిమా సంచలనాలను క్రియేట్ చేసింది. నిజానికి ఎంజీఆర్, కరుణ నిధి రియల్ స్టోరీ ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. అయితే మొదట ఎంజీఆర్ క్యారెక్టర్ ని రజనీకాంత్ తో చేయించాలని మణిరత్నం అనుకున్నాడు. కానీ రజనీకాంత్ ఆ క్యారెక్టర్ లో చేయకూడదంటూ ఎంజీఆర్ అభిమానులు అలాగే మరి కొంతమంది తమిళ్ ప్రేక్షకులు రజనీకాంత్ మీద కొంతవరకు ఫోర్స్ తీసుకురావడంతో ఆయన ఆ పాత్రను చేయకుండా వదిలేశాడు.

    ఎందుకంటే అందులో నెగెటివిటీ ని కనుక చూపించినట్టైతే రజనీకాంత్ ఎంజీఆర్ ఫ్యాన్స్ విషయంలో చాలా బ్యాడ్ అయిపోతాడు. అందువల్ల రజినీకాంత్ ఆ పాత్ర నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే మలయాళం సినిమా నటుడు ఆయన మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ లను పెట్టి తీసిన ఈ సినిమా పెను రికార్డులను కూడా తిరగరాసింది.

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా అలా వరకు మంచి క్రేజ్ ను అయితే దక్కించుకుంది. ఇక ఇప్పటికి కూడా ఆ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత సందేహం లేదు. ఇక మణిరత్నం తీసిన టాప్ మూవీస్ లిస్ట్ లో ‘ఇద్దరు ‘ సినిమా తప్పకుండా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప సినిమాని మిస్ చేసుకున్నందుకు ఇప్పటికి రజినీకాంత్ చాలా వరకు బాధపడుతూ ఉంటాడట…ఇక ఏది ఏమైనప్పటికీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా క్లాసికల్ సినిమా గానే మిగిలిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక దళపతి, రోజా, బొంబాయి, సఖి, నాయకుడు లాంటి సినిమాలను ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు. మరి మొత్తానికైతే మణిరత్నం ఇప్పుడు కూడా కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తూ తన కెరియర్ లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు…