మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో ‘ఆచార్య’ తరువాత ఆ రేంజ్ అంచనాలు ఉన్న మరో సినిమా ‘లూసిఫర్’ రీమేక్. ఈ సినిమాని ఇప్పటికే లాంచ్ చేసిన చిరు, ఆల్ రెడీ ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి డేట్స్ కూడా ఇచ్చేశాడు. పైగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారని.. ఆ మార్పులు విషయంలో చిరుదే కీలక భూమిక అని.. అలాగే కొత్తగా చేసిన మార్పులను మెగాస్టారే చెప్పారని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలోనే మొదలు కానుంది. షూటింగ్ ఎక్కడ చేయాలో లొకేషన్స్ ను కూడా ఫైనల్ చేసిందట చిత్రబృందం.
ఐతే, చిరంజీవి మాత్రం ‘ఆచార్య’ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాతే ఈ రీమేక్ షూట్ లో పాల్గొంటారట. అప్పటివరకు, చిరంజీవితో సంబంధంలేని సీన్లను తీయాలని దర్శకుడు మోహన్ రాజా షెడ్యూల్ వేసుకున్నాడట, ‘లూసిఫర్’ రీమేక్ లో మిగతా క్యాస్టింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు. కానీ.. ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ను పెట్టారని.. ఆ హీరోయిన్ పాత్రలోనే నయనతార నటించబోతుందని.. చిరు – నయన మధ్య మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా బాగా పెట్టారని.. సినిమాలోనే హైలైట్ అయ్యే సీన్స్ అన్ని చిరు – నయనల మధ్యే వస్తాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్రలో సత్యదేవ్ సెట్ అయ్యాడు. అన్నట్టు తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రెండు ట్యూన్స్ ను ఇచ్చాడట. అవి చాల బాగా వచ్చాయట. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చెయ్యాలనుకుంటున్నా.. ఇప్పడున్న పరిస్థుతులను బట్టి.. అది సాధ్యమయ్యే పని కాదు. ఈ సినిమాతో పాటు ‘వేదాళం’ రీమేక్ ను కూడా చిరు చేయబోతున్నాడు. ఒక ఏడాదిలో ఒకేసారి రెండు సినిమాలు చేయాలంటే.. కాస్త కష్టమే. పైగా ఈ వయసులో ఒకేసారి రెండు సినిమాలను ఒకే టైంలో పూర్తి చేయడం అంటే.. సాధ్యమయ్యే పని కాదు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Megastar chiranjeevi wants to do two movies at once
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com