Megastar Chiranjeevi
Megastar Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థితి గతులను మార్చిన మహనీయులలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్, ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త దారిలో పయనించేలా చేసాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మెగాస్టార్ చిరంజీవి కి ముందు, ఆ తర్వాత అని విభజించి చూడడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన వచ్చిన తర్వాత తెలుగు కమర్షియల్ సినిమా మారిపోయింది. డ్యాన్స్, ఫైట్స్ లో వేగం పెరిగింది. పాటల్లో సరికొత్త జోష్ వచ్చింది. కమర్షియల్ సినిమా ఫార్మటు మొత్తం వృద్ధి చెందింది. ఆ స్థాయిలో ఆయన పరుగులు తీయడమే కాకుండా, ఇండస్ట్రీ ని కూడా పరుగులు తీయించాడు. అందుకే చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. తారలు మారే కొద్దీ, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా తనని తాను మలుచుకోవడం మెగాస్టార్ స్టైల్.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!
కేవలం సినిమాల్లో రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు, సేవ కార్యక్రమాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి కి సాటి ఎవ్వరూ రాలేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గుర్తించి పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డ్స్ తో సత్కరించింది. ముఖ్యమంత్రి నుండి ప్రధాన మంత్రి వరకు ప్రతీ ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి ని ఎంతో ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కి సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన పురస్కారం వచ్చి చేరింది. లండన్(United Kingdom) ప్రభుత్వం ఆయన్ని ప్రత్యేకంగా ‘కాన్ఫర్ హానరరీ సిటిజెన్ షిప్’ తో సత్కరించనుంది. అంటే నాన్ బ్రిటిష్ సిటిజెన్ కి ఈ పురస్కారం ద్వారా దేశానికీ వారు చేసిన ముఖ్యమైన సేవలను గుర్తిస్తూ ఒక హోదాని ప్రకటించే కార్యక్రమం అన్నమాట. ఈ నెలలోనే లండన్ లో అక్కడి ప్రభుత్వం లాంఛనంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ పురస్కారం ని అందించనున్నారు.
ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ కి కూడా ఇలాంటి గుర్తింపు దక్కలేదు. ఆ విధంగా అరుదైన గుర్తింపు పొందిన ఏకైక భారతీయుడిగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భవిష్యత్తులో ఇలాంటి గౌరవాలు ఇతర హీరోలకు కూడా రావొచ్చు, కానీ మొట్టమొదటి హీరో ఎవరు అని అంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా, అదే విధంగా శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమా చేయబోతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను కొల్లగొట్టిన మెగాస్టార్, రాబోయే సినిమాలతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు