https://oktelugu.com/

Mohan Babu : మోహన్ బాబు కొట్టిన జర్నలిస్టు రంజిత్ పరిస్థితి ఎలా ఉంది..?

సినిమా ఇండస్ట్రీలో హీరో అనగానే వాళ్లకంటూ ఒక సపరెట్ క్రేజ్ అయితే ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 10:29 AM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu : సినిమా ఇండస్ట్రీలో హీరో అనగానే వాళ్లకంటూ ఒక సపరెట్ క్రేజ్ అయితే ఉంటుంది. కొంతమంది హీరోలు నటనతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా గొప్ప పేరు ను కూడా సంపాదించుకుంటారు. ఇక అందులో మోహన్ బాబు ఒకరు…

    ఒకప్పుడు నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో టాప్ యాక్టర్ గా కొనసాగిన మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలేమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఇక తన కొడుకులను తన నట వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికి వాళ్ళు సక్సెస్ ని మాత్రం సాధించలేకపోయారు. దాని వల్ల వాళ్లు ఫెయిల్యూర్ హీరోలుగా మిగిలారు. ఇక ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఆస్తికి సంబంధించిన తగాదాలు వస్తున్నాయంటూ గత కొద్దిరోజుల నుంచి వార్తలు నిలుస్తున్నారు. ఇక ఎట్టకేలకు రోడ్డుకు ఎక్కిన వీళ్ళ గొడవని సాల్వ్ చేయడానికి ఎవరు కూడా పెద్దగా సాహసం అయితే చేయడం లేదు. దాంతో పోలీసులే రంగంలోకి దిగి వాళ్ల ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిన్న నైట్ మోహన్ బాబు క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కొంతమంది మీడియా మిత్రులు ఆయన ఇంటికి వచ్చారు. కానీ అప్పటికే ఫ్రస్టేషన్ లో ఉన్న మోహన్ బాబు ప్రముఖ టివి ఛానల్ రిపోర్టర్ మీద దాడి చేశాడు. దాంతో రంజిత్ అనే పేరుగల ఆ రిపోర్టర్ యొక్క బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో మీడియా జర్నలిస్టులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మోహన్ బాబు మీద తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఈ గొడవల మధ్య లో మోహన్ బాబు పరిస్థితి ఏంటి తను ఎలా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన రిపోర్టర్స్ మీద అలా దాడి చేయడం సరైన పద్ధతి అయితే కాదు. ఇక ఆ రంజిత్ అనే వ్యక్తి అయ్యప్ప మాలలో ఉన్నాడు.

    ఆయన అసలు ఎలాంటి క్వశ్చన్ అడగకముందే తను అలా ఫ్రస్టెట్ అయి మైకు తీసి అతని మొహానికి విసిరి కొట్టడం తో ఆయన అక్కడికక్కడే కింద పడిపోయాడు. దాంతో గాయాలు కూడా అయ్యాయి. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు మోహన్ బాబు అంత ఫ్రస్టేషన్ లో ఉన్నాడు.

    తన కొడుకులను కంట్రోల్లో పెట్టుకున్నాను క్రమశిక్షణతో పెంచుతున్నాను అంటూ డబ్బా కొట్టుకునే మోహన్ బాబు ఇలాంటి ఒక దుస్థితి కి ఎందుకు దిగజారాడు అంటూ సినిమా పెద్దలతో పాటు మీడియా జర్నలిస్టులు సైతం మోహన్ బాబు మీద తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు మోహన్ బాబు అంటే సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మోహన్ బాబు అంటే గొడవలు, అల్లర్లతో తన మీద ఉన్న మంచి ఇంప్రెషన్ ను పోగొట్టుకుంటున్నాడనే చెప్పాలి… మరి ఇకమీదటైనా వీళ్లఫ్యామిలీ మెంబర్స్ అందరు కాంప్రమైజ్ అయి కలిసిమెలిసి ఉంటారా? లేదంటే ఈ గొడవను ఇంకా ముందుకు తీసుకెళ్తారా అనేది తెలియాల్సి ఉంది…