Mega Star Chiranjeevi: సినిమా టికెట్ల ధరలపై జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చిరంజీవి లాబీయింగ్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చిరంజీవితో సీఎం జగన్ సానుకూలంగా స్పందించి అందుకు తగ్గట్టు జీవో రిలీజ్ చేశారు. కాగా ఈ జీవో రిలీజ్ చేసినందుకు గానూ ఫిల్మ్ ఛాంబర్ తరపున కొందరు సినీ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కు ధన్యవాదాలు చెప్పారు.
ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపారు. సమస్యల పరిష్కారంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు, త్వరలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెబుతాము, వైజాగ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధి అయ్యేలా చూస్తాం. అలాగే చిరంజీవి తను పెద్ద కాదన్నా ఆయనే మాకు పెద్ద.. ఇద్దరు ముఖ్యమంత్రులకు సన్మానం చేసేందుకు త్వరలోనే చిరంజీవిని కలుస్తాం, ఒక వేడుక ఏర్పాటు చేసి సీఎంలను సన్మానిస్తాం. అని సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మా విజ్ఞప్తిని స్వీకరించి, అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇతర సమస్యలకూ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అంటూ తమ్మారెడ్డి మాట్లాడారు.
అలాగే ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ చాలా “స్నేహపూర్వకంగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ముందుకురావడం అభినందనీయం’ అని ఎన్వీ ప్రసాద్ చెప్పుకుకొచ్చాడు.
ఇక చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ నుంచి ఎన్నో ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి కూడా వాటిని గుర్తించారు. ఇక థియేటర్లు బాగుంటేనే సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. చిత్ర పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం ఇంకా కావాలి’ అని చదలవాడ మాట్లాడారు.
Also Read: Nagarjuna Mass Movie: నాగార్జున మాస్ సినిమా గురించి మీకు ఈ విషయాలు తెలుసా..