https://oktelugu.com/

BJP MLAs: స‌స్పెండ్ చేయ‌డంపై హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేల పిటిష‌న్‌.. లేని అస్త్రాన్ని కేసీఆరే ఇచ్చారా..?

BJP MLAs: నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు పోరాటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ముందు నిన్న నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు.. పార్టీ కీలక నేతలతో కలిసి తమిళిసైకి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసి తమను ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలంటూ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 8, 2022 / 06:12 PM IST
    Follow us on

    BJP MLAs: నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు పోరాటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ముందు నిన్న నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు.. పార్టీ కీలక నేతలతో కలిసి తమిళిసైకి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసి తమను ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

    BJP MLAs

    ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభం కాలేదు. ఇదే విషయంపై నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వద్దంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రసంగం మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కలగజేసుకుని తమ‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కోరారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి ముగ్గురిని రూల్ ప్రకారం సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించడం, వెంటనే స్పీకర్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి.

    అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే తొలిసారి అసెంబ్లీకి రావడం. దీంతో ఈట‌ల‌ ముఖం చూడటం ఇష్టం లేకనే కేసీఆర్ ఇలా ఏ కారణం లేకుండా సస్పెండ్ చేశార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం బీజేపీకే మైలేజ్ గా మారుతోంది. ఎందుకంటే వారిని సస్పెండ్ చేయడానికి బలమైన కారణం అంటూ ఏదీ లేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

    TS High Court

    పైగా అ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం ఇక్కడ బీజేపీకి బలమైన కారణంగా మారిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి లేని అస్త్రాన్ని కేసీఆర్ స్వయంగా ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ. అకారణంగా సస్పెండ్ చేయడాన్ని బూచిగా చూపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సానుభూతి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ కి బాగా ప్లస్ పాయింట్ లాగా మారిపోయింది. ఈటలపై కేసీఆర్ కక్షపూరితంగా నే ఇలా చేసాడంటున్నారు చాలామంది. గతంలో రాజాసింగ్, రఘునందన్ రావు లను ఇలా సస్పెండ్ చేసిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచిన ఈటల.. తొలిసారి అసెంబ్లీకి రాగానే ఇలా కక్షపూరితంగానే చేసాడంటున్నారు రాజకీయ విమర్శకులు.

    Tags