https://oktelugu.com/

Charan couple trip to Finland: ఫిన్లాండ్ విహారయాత్రలో చరణ్ దంపతులు !

Charan couple trip to Finland: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్‌ కు చరణ్ స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి తన సతీమణి ఉపాసనతో కలిసి వేకేషన్‌ కి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ మెగా హీరో.. ప్రస్తుతం తన భార్యకు సమయం కేటాయించి సరదాగా గడుపుతున్నాడు. కాగా మెగా పవర్ స్టార్ రామ్చరణ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 8, 2022 / 06:30 PM IST
    Follow us on

    Charan couple trip to Finland: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్‌ కు చరణ్ స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి తన సతీమణి ఉపాసనతో కలిసి వేకేషన్‌ కి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ మెగా హీరో.. ప్రస్తుతం తన భార్యకు సమయం కేటాయించి సరదాగా గడుపుతున్నాడు.

    Charan, Upasana

    కాగా మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్లాండ్కు విహారయాత్రకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ‘రెండు సంవత్సరాల తర్వాత వెకేషన్కు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్యూ చరణ్’ అంటూ ఉపాసన కూడా ట్వీట్ చేశారు.

    Also Read: Anupama Parameswaran: రెడ్ డ్రెస్ తో ‘అనుపమ పరమేశ్వరన్’.. నెటిజన్లు ఫిదా

    ఇక ఈ వెకేషన్ పూర్తి కాగానే చరణ్ శంకర్ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయనున్నాడు. కాగా రామ్‌చరణ్‌–శంకర్‌ సినిమాని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్ర యూనిట్‌. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది.

    నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి 18 నుంచి 28వ తేదీ వరకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది.

    Also Read: Prabhas Marriage Date: ప్రభాస్ పెళ్లి తేదీ అదే.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వ్యక్తి

    Tags