Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా హిట్ అవడంతో ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగింది. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి భారీ బడ్జెట్ సినిమాల్లో మాత్రం కనిపించలేకపోయింది. ఇక సినిమా లైఫ్ ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కలిసి వచ్చింది. ఎందుకంటే ప్రేమించిన వారు దొరకడం అదృష్టం. అందులో మెగా ఫ్యామిలీ కోడలుగా అడుగు పెట్టడం మరింత లక్ అంటారు మెగా అభిమానులు.
వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి.. రీసెంట్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఈమెకు ఫాలోవర్స్ మరింత పెరిగారు. దీంతో ఈమె పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇదే విధంగా సొట్టబుగ్గల సుందరి చేసిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అనుకుంటున్నారా? లావణ్య త్రిపాఠికి మేనల్లుడు పుట్టాడట.
ఈ క్రమంలోనే తనకు మేనల్లుడి పుట్టాడని.. తన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన మొహం కనబడకుండా బాబు ఫోటోను అభిమానులతో పంచుకుంది. అయితే మేనల్లుడు పుట్టడమే కాదు తన సొట్టబుగ్గలను వారసత్వంగా తీసుకున్నాడటంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంతేకాదు లావణ్య గుడ్ న్యూస్ చెప్పిందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక పెళ్లికి ముందే వెబ్ సిరీస్ లో నటించిన లావణ్య పెళ్లి తర్వాత సినిమాలకు ఒకే చెప్పలేదు. ఈమె పెళ్లికి ముందు నటించిన వెబ్ సిరీస్ లే ఇప్పుడు రిలీజ్ అవడానికి సిద్దంగా ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతుందో లేదో చూడాలి.