https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు వెకేషన్ కు ఎందుకు వెళ్తారో తెలుసా?

విరామం దొరికితే చాలు మహేష్ బాబు విదేశాలకు చెక్కేస్తుంటారు. దాదాపు సంవత్సరంలో మూడు సార్లు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది మహేష్ బాబుకు.

Written By: , Updated On : January 9, 2024 / 04:08 PM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి పెద్దగా సమయం లేదు. సంక్రాంతి బరిలో దిగి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. దీని కోసం చిత్ర యూనిట్ తమదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను హిట్ కొట్టేలా అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో మహేష్ బాబు కూడా పలు ఇంటర్య్వూలకు హాజరవుతున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్ లలో బిజీ అయ్యారు మిల్క్ స్టార్.

కాస్త విరామం దొరికితే చాలు మహేష్ బాబు విదేశాలకు చెక్కేస్తుంటారు. దాదాపు సంవత్సరంలో మూడు సార్లు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది మహేష్ బాబుకు. తరచూ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్ళడానికి కారణం ఏంటని ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం, సరదాగా గడపడం ఇష్టం అని తెలిపారు. అయితే ఇండియాలో అలా తిరగడం కష్టం కాబట్టి ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ కు వెళ్తామని తెలిపారు మహేష్.

తనకు యూరఫ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. అయితే ట్రిప్ కు వెళ్తే రీచార్జ్ అయిన ఫీల్ వస్తుందని.. దీంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు మహేష్. అంతేకాదు ఈ క్రమంలోనే గ్లామర్ సీక్రెట్ కూడా అడగగా.. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండడమే తన గ్లామర్ సీక్రెట్ అన్నారు. ఇక ఈ స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించాలని కోరుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు. మరి అందరి కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి.