Meera Jasmine: మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయింది. ఐతే, ఈ ఫ్యామిలీ హీరోయిన్ బిజీగా ఉన్న సమయంలో కూడా ఎన్నడూ గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయలేదు. కానీ, ఫేడ్ అవుట్ అయిపోయాక, పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది.

తాజాగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ మళ్లీ అరాచకానికి తెరలేపింది. బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె కేవలం షర్ట్ మాత్రమే ధరించింది. మీరా జాస్మిన్ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయింది. సారీ; మర్చిపోలేదు.. కావాలనే హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోల్లో మీరా జాస్మిన్ హాట్ హాట్ గా కనిపిస్తోంది. రీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఇలా హద్దులు దాటి అందాల ప్రదర్శన చేస్తుంటే.. అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా బోల్డ్ గా రెచ్చిపోవాలని మీరా జాస్మిన్ ఫిక్స్ అయిపోయినట్టు ఉంది.

అసలు ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు గ్లామర్ షోకు దిగడానికి కారణం ఏంటి అని అభిమానులు నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారు. మూవీల్లో అవకాశాల కోసమే ఫొటో షూట్ చేసిందని అంటున్నారు. కాగా 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత మూవీలకు బ్రేకిచ్చింది మీరా. మళ్లీ రీఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Actress Meena: భర్త చనిపోయిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న మీనా

జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన మీరా, ప్రస్తుతం మకల్ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. గుడుంబా శంకర్, గోరింటాకు వంటి చిత్రాలతో తెలుగు సినీ అభిమానులకు పరిచయమైన మీరా జాస్మిన్, డీసెంట్ క్యారెక్టర్స్ తో బాగా అలరించింది. అలాగే యువ లాంటి సినిమాల్లో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకి నిద్ర కూడా లేకుండా చేసింది.

ఏది ఏమైనా మీరా జాస్మిన్ కి ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్, విక్రమ్, రవితేజ, విశాల్ వంటి పెద్ద హీరోల సరసన ఆడిపాడి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించింది. సౌత్ లో తెలుగు, తమిళ సినిమా రంగాల్లో ఫుల్ క్రేజ్ తో వరుస హిట్స్ అందుకుని.. దాదాపు పదేళ్ల పాటు ఫుల్ బిజీగా సినిమాలు చేసింది.

అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ ఫ్యామిలీ హీరోయిన్.. ప్రస్తుతం తన మకాంను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసుకుందని.. గతంలో తనతో సినిమాలు చేసిన హీరోలను దర్శకులను కలిసి మీ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వండి అంటూ మీరా అందర్నీ రిక్వెస్ట్ చేస్తోందట. ఉన్నట్టు ఉండి మీరా జాస్మిన్ సినిమాల పై ఫోకస్ పెట్టడానికి గల కారణం.. ఆర్ధిక ఇబ్బందులు అట.

Also Read: Ashu Reddy: అషురెడ్డి సీక్రెట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ టాటూ వేసుకుందా?
[…] […]