Actress Meena: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో ఆటు అద్భుతమైన అభినయం కనబరిచే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు మీనా..బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన అన్ని ప్రాంతీయ బాషలలో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..కెరీర్ పీక్స్ స్థానం లో ఉన్నప్పుడే విద్య సాగర్ అనే బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకున్న మీనా ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించింది..అయితే కొత్త హీరోయిన్స్ రాక తో హీరోయిన్ గా మీనా జోరు బాగా తగ్గిపోయింది..అలాంటి సమయం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయ్యి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది మీనా..వృత్తి పరంగా మరియు వ్యక్తిగతంగా సాఫీగా సాగిపోతున్న మీనా జీవితం ని కరోనా మహమ్మారి శోక సంద్రం లోకి నెట్టేసింది..ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సమయం లోనే మీనా గారి భర్త ఊపిరి తిత్తులు బాగా ఇన్ఫెక్ట్ అయ్యాయి..అప్పటి నుండి ఈ ఇన్ఫెక్షన్ రోజు రోజుకు పెరుగుతూ పోతూ విద్య సాగర్ ని తీవ్రమైన అస్వస్థకు గురి చేసింది.

ఊపిరి తిత్తులు మార్చాలని డాక్టర్లు చెప్పగా..డోనార్స్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు..కానీ ఎంత ప్రయత్నం చేసిన ఊపిరి తిత్తులు దానం చేసేవారు దొరక్కపోవడం తో మందుల ద్వారానే చికిత్స చేయించారు..కానీ ఫలితం లేకుండా పోయింది..ఇటీవలే ఆయన కన్నుమూసి మీనా కుటుంబం మొత్తాన్ని శోకసంద్రం లోకి నెట్టేశాడు.
Also Read: Mahesh Babu: విడుదల కాకుండా ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే

అయితే భర్త చనిపోయిన తర్వాత మీనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది..అదేమిటి అంటే ఇకపై ఆమె సినిమాల్లో నటించబోవడం లేదట..పూర్తిగా తన కూతురు నైనికా బాధ్యతలు చేపట్టడానికి ఆమె సినిమాలకు దూరం అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం..అయితే భర్త చనిపోయిన బాధని మర్చిపోవడానికి సినిమాలు చెయ్యడం ఒక్కటే మార్గం అని ఆమె సన్నిహితులు మీనా కి సలహాలు ఇస్తున్నారట..మరి ఆమె భవిష్యత్తులో సినిమాలు చేస్తుందో లేదో చూడాలి..ఇప్పటికే మీనా కూతురు నైనికా పలు తమిళ సినిమాల్లో బాలనటిగా నటించింది..ఆమె విజయ్ తో కలిసి నటించిన తేరి అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా లో ఆమె విజయ్ కూతురు గా ఎంతో క్యూట్ గా నటించింది..భవిష్యత్తులో ఈమె హీరోయిన్ గా కూడా అడుగుపెట్టబోతుందని సమాచారం
Also Read:TikTok Fame Durga Rao: బిగ్ బాస్ కు షాకిచ్చిన దుర్గారావు.. అసలేం జరిగింది?
Recommended Videos



[…] Also Read: Actress Meena: భర్త చనిపోయిన తర్వాత సంచలన నిర్… […]
[…] Also Read: Actress Meena: భర్త చనిపోయిన తర్వాత సంచలన నిర్… […]