Mahesh Babu: మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ నేటి తరం హీరోలలో ఎవరికీ కూడా లేదు అనే చెప్పాలి..అందుకే ఆయన సినిమాలు ఒక మోస్తరుగా ఉన్నా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలుస్తుంది..దానికి లేటెస్ట్ ఉదాహరణే సర్కారు వారి పాట సినిమా..ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే యావరేజి టాక్ ఉంది..ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్నప్పటికీ, ఫుల్ రన్ లో అద్భుతమైన వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..అలా వరుసగా మూడు సార్లు హాట్రిక్ వంద కోట్ల రూపాయిల షేర్స్ ని కొల్లగొట్టిన ఏకైక టాలీవుడ్ హీరో గా మహేష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు..త్వరలోనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ఇప్పటికే జరిగిపోయాయి..అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించుకోబోతుంది..ఇది కాసేపు పక్కన పెడితే మహేష్ బాబు వి కొన్ని సినిమాలు షూటింగ్ ని ప్రారంబించుకొని..ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సినిమాలు మనకి తెలియకుండా చాలానే ఉన్నాయి..అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మనకి అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు మాత్రమే వచ్చాయని తెలుసు..కానీ మనకి తెలియకుండా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభం అయ్యి..రెండు షెడ్యూల్స్ షూటింగ్ ని జరుపుకొని ఆగిపోయిన ఒక సినిమా ఉంది..ఆ సినిమా పేరే ‘హరే రామ హరే కృష్ణ’..మహేష్ తో ఒక్కడు వంటి సెన్సషనల్ హిట్ తీసిన MS రాజు ఈ సినిమాకి నిర్మాత..ఘనంగా ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది..సరిగ్గా ఇలాగె అప్పట్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ‘శివమ్’ అనే సినిమాని ప్రారంబించాడు మహేష్..ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది..ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ని తీసుకున్నారు.
Also Read: Master Bharath: మాస్టర్ భరత్ విషాద జీవితం గురించి వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

మహేష్ మరియు సోనాక్షి మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు కూడా..కానీ మధ్యలోనే ఈ సినిమా అర్థాంతరం గా ఆగిపోవడం తో అభిమానులు నిరాశకి గురైయ్యారు..అంతే కాకుండా మహేష్ బాబు – విజయ్ – మణిరత్నం కాంబినేషన్ లో అప్పట్లో ఒక భారీ పీరియాడిక్ డ్రామా ని నిర్మిస్తున్నాము అని ప్రకటించారు..కానీ ఈ సినిమా బడ్జెట్ కారణాల వల్ల సెట్స్ మీదకి వెళ్ళలేదు..ఇక దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై హేమ చందర్ అనే నూతన దర్శకుడు తో మిర్చి అనే సినిమాని ప్రకటించాడు మహేష్..ఇది కూడా సెట్స్ మీదకి వెళ్లకుండానే అట్టకెక్కింది..ఆ తర్వాత ఇదే టైటిల్ ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..మరోసారి ప్రభాస్ నటించిన సినిమా టైటిల్ తోనే అప్పట్లో సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించాడు మహేష్..ఆ సినిమా పేరు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ..ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది..ఇలాగె పూరి జగన్నాథ్ తో జనగణమన అలాగే VV వినాయక్ తో ఒక్క సినిమాని ప్రకటించి మధ్యలో ఆపేసాడు మహేష్.
Also Read:TikTok Fame Durga Rao: బిగ్ బాస్ కు షాకిచ్చిన దుర్గారావు.. అసలేం జరిగింది?