Mark Shankar : గత నాలుగు రోజులగా లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు చర్చనీయాంశంగా నిల్చింది సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది చిన్నారులు గాయాలు పాలవ్వడం, ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) కూడా గాయపడ్డాడు. అతని చేతికి, కాళ్లకు గాయాలు అయ్యాయి. నల్లపొగని పీల్చడం వల్ల ఘటన స్థలం వద్ద స్పృహ తప్పి పడిపోయిన మార్క్ శంకర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ని అందించడంతో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్నీ మొన్న ట్విట్టర్ వేదికగా మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండియా కి మార్క్ శంకర్ తో కలిసి సురక్షితంగా తిరిగి వచ్చాడు.
Also Read : పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ వైద్యానికి అయిన ఖర్చు ఇంతేనా..?
నిన్న అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో విడుదలై చక్కర్లు కొట్టింది. పవన్ కళ్యాణ్ తన కొడుకు మార్క్ శంకర్ ని ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. ఈ వీడియో లో ఆయనతో పాటు సతీమణి అన్నా లెజినోవా, కూతురు పోలేనా కూడా ఉన్నారు. అదే విధంగా కాకినాడ జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి సింగపూర్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ విజువల్స్ ని చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఎప్పుడో అతనికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు అభిమానులు చూసారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతను మీడియా కి కనిపించాడు. ఇక మీదట కొన్నాళ్ల వరకు అతను ఇండియా లోనే ఉంటాడని తెలుస్తుంది. వాస్తవానికి మొదటి నుండి మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాడు.
సమ్మర్ క్యాంప్ అవ్వడంతో సింగపూర్ కి పంపించాడు. అక్కడ అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. కోట్లాది మంది అభిమానులు ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు, మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. అంతే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించారు. అందరి దీవెనెలు ఉండడం వల్ల నేడు మార్క్ శంకర్ సురక్షితంగా ఉన్నాడని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇండియా కి తిరిగి వచ్చేశాడు కాబట్టి, నేటి నుండి ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే నెల మే 9న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఒత్తిడి తీసుకొని రావడంతో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
Also Read : మార్క్ శంకర్ కోసం సింగపూర్ కి రేణు దేశాయ్..కానీ చివరికి ఏమైందంటే!
#MarkShankar back to home .@PawanKalyan pic.twitter.com/jldimnkuOr
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 12, 2025