Mark Shankar : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్(Mark Shankar Pawanovich) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురై గాయాలపాలైన ఘటన ఎంతటి సెన్సేషనల్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా చర్చకు దారిన తీసిన ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు స్పందించి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే ఎట్టకేలకు మార్క్ శంకర్ కోలుకున్నాడని, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చేశాడంటూ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులకు అధికారికంగా ప్రకటించాడు. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్(Renu Desai) మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆమె స్పందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : మార్క్ శంకర్ సేఫ్..సోషల్ మీడియా ని ఊపేస్తున్న లేటెస్ట్ ఫోటో!
ఈ విషయం తెలిసిన వెంటనే రేణు దేశాయ్ సింగపూర్ కి తన కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య తో కలిసి సింగపూర్ కి వెళ్లేందుకు సిద్దమైందట. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఏమి పర్వాలేదు, మేమే వచ్చేస్తున్నాం త్వరలో ఇండియా కి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది అని చెప్పాడట. ఫోన్ కాల్ సంభాషణలో పవన్ కళ్యాణ్ అలా చెప్పడంతో రేణు దేశాయ్ సింగపూర్ పర్యటన విరమించుకుంది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, వీళ్లిద్దరు వైవాహిక జీవితం నుండి విడిపోయినప్పటికీ, ఒక మంచి స్నేహితులు లాగా ఉంటున్నారు అని. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా అకిరా నందన్ ని తన సొంత కొడుకు లాగానే భావిస్తూ ఉంటుంది అనేది ఇటీవల కాలంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసాము.
కుంభమేళాలో కూడా అన్నా లెజినోవా తో పాటుగా అకీరా నందన్(Akira Nandan) పుణ్య స్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్ గా అకిరా నందన్ తన తండ్రి తో కలిసి తీర్థ యాత్రలకు వెళ్లిన విషయం గురించి ఇటీవల రేణు దేశాయ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తూ ‘నేనే దగ్గరుండి అకిరా ని పంపించాను..పవన్ కళ్యాణ్ ఒక మంచి తండ్రి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదే విధంగా అకిరా నందన్ సినీ రంగ ప్రవేశం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే వార్తలన్నీ అబద్దాలే అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సింగపూర్ నుండి సోమవారం రోజున హైదరాబాద్ కి వస్తాడని. వచ్చిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొని తనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తాడని తెలుస్తుంది.
Also Read : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!