Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి హెల్ప్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మహేష్ బాబు ఫారన్ టూర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రాజమౌళి (Rajamouli) సైతం జపాన్ కి వెళ్ళాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇటు హీరో అటు దర్శకుడు ఇద్దరు విదేశాల చుట్టు తిరుగుతూ ఉండడతో వాళ్ల అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ సినిమాని రీసెంట్ గా మొదలుపెట్టి ఒక షెడ్యూల్ అయితే పూర్తి చేశారు. ఇక రాజమౌళి ఒక ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ను కలవడానికి జపాన్ కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరెంటో తెలియదు కానీ ఆయనతో ఒక భారీ యాక్షన్ సీన్ తీయించాలని చూస్తున్నారట.
Also Read : మహేష్ తో రాజమౌళి.. ఆ సెంటిమెంట్ ఫాలో
ఇక శరవేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా అనుకున్న సమయంలో ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి అనుకుంటున్నాడు. అయినప్పటికి ఈ సినిమా రోజు రోజుకు డిలే అవుతుండడంతో సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద వాళ్ళు పెట్టుకున్న అంచనాలను పెంచేసుకుంటున్నారు.
ఇక దానికి తోడుగా వీళ్ళు విదేశాల చుట్టూ తిరుగుతుంటే సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? రాదా అనే ఒక తీవ్రమైన ఇబ్బందికి కూడా గురవుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని నెంబర్ వన్ డైరెక్టర్ గా మారిన రాజమౌళి ఇకమీదట పాన్ వరల్డ్ లో సైతం పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?