మందిరా బేడి… ఆమె వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. అయినా ఎక్స్ పోజింగ్ లో ఎక్కడా వెనక్కి తగ్గదు. బీచ్ హాలిడే కి వెళ్ళి మరీ హాట్ హాట్ ఫొటోలతో తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఇప్పటి కుర్రకారును కూడా తన అందచందాలతో ఒక ఊపు ఊపుతూంటుంది. అన్నట్టు మందిరా బేడి ఈ మధ్య పారడైస్ సిటీకు హాలిడే కోసం వెళ్లి అక్కడ నుండి కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇచ్చింది. అయితే ముదురు వయసులోనూ గ్లామర్ షోతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ఈ ముదురు బ్యూటీ పడుతోన్న తపన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. అసలు ఆమె గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.
Also Read: బిగ్ బాస్: పాపం అరియానా.. ‘మాస్టార్’ చేతిలో మోసపోయింది..!
అయితే గత కొంతకాలంగా ఎంత స్క్రీన్ షో చేసినా.. బాలీవుడ్ లో ఆఫర్లు ఇచ్చేవారు కరువు అయిపోయారు మందిరాకి. ఏదో చిన్నాచితాకా రోల్స్ తప్ప మందిరాకి చెప్పుకోతగ్గ అవకాశాలు వచ్చి చాల కాలం అయింది. సీనియర్ బ్యూటీగా మారింది కాబట్టి ఆమెకు క్రేజీ ఆఫర్లు రావడం లేదనేది ఒక కారణం అయితే, ఎప్పటికప్పుడు అందుబాటులో లేకుండా హాలిడే ట్రిప్స్ అంటూ ఫుల్ బిజీగా ఉంటుండటం కూడా మరో కారణం అని.. అందుకే ఆమెకు పెద్దగా చాన్స్ లు రావడం లేదని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఏది అయితే ఏమి.. ఏభై ఏళ్ల వయసులో కూడా బికినీ వేసి మరీ ఆకట్టుకుంటున్నా ఈ ముదురు బ్యూటీని సినిమాల అవకాశాలతో సేద తీర్చేవాళ్ళు లేకపోవడం బాధాకరమైన విషయమే.
Also Read: పవన్ ఫ్యాన్ ను కెలికిన దేవి నాగవల్లి.. ఏం జరిగిందంటే..?
అయినా మందిరా మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. నటిగా, టీవీ వ్యాఖ్యాతగా, ఫ్యాషన్ డిజైనర్ గా ఈ గ్లామర్ ప్రపంచంలో తనకు ఏ అవకాశం వస్తే అది అందిపుచ్చుకుంటూ ముందుకుపోతోంది. ఆ రకంగా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాగూ తన అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శించకుండా ఉండలేదు కాబట్టి.. కుర్రాళ్ళు కూడా ఆమెను ఫాలో అవుతూ ఆమె క్రేజ్ ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. అందుకేనేమో ఈ మధ్య మందిరా కూడా మొత్తానికి వీలైనంత హాటుగా కనిపిస్తూ పోజులివ్వడానికి తెగ కష్టపడుతుంది. దీనికి తోడు అప్పుడప్పుడు ఫుల్ హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Comments are closed.