
త్వరలో ఓ పుస్తకం ఆధారంగా నిర్మించబోతున్న ఓ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్లు ధోని ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ కు డైరెక్టర్ గ కొనసాగుతున్న ధోని భార్య సాక్షి ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్ ను పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఆధారంగా నిర్మిస్తున్నట్లు తెలిపింది. దీనిలోని ప్రతి పాత్రను అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్ది తెరపైకి తీసుకువస్తామని… ఇది సినిమా కంటే వెబ్ సిరీస్ గానే బాగుంటుందని వెల్లడించింది. ధోని ఇదివరకే “రోర్ అఫ్ ది లయన్ “అనే డాక్యూమెంటరీ కి నిర్మాణ బాధ్యతలు చేప్పట్టిన విషయం తెలిసిందే.
Also Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్ రాకతో సన్‘రైజ్’