Manchu Vishnu: మంచు కుటుంబం లో జరుగుతున్నా వివాదం గత రెండు రోజులుగా ఎన్నో నాటకీయ కోణాల్లో మలుపులు తిరుగుతున్నా సంగతి తెలిసిందే. మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ. ప్రముఖ మీడియా చానెల్స్ అన్ని మోహన్ బాబు ఇంటి ముందే ఉన్నాయి. నిన్న రాత్రి గొడవ తారాస్థాయికి చేరుకుంది. మనోజ్ మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, మోహన్ బాబు ఆవేశం తో మీడియా రిపోర్ట్స్ పై చెయ్యి చేసుకోవడం వంటివి సంచలనం గా మారాయి. దీనిపై కాసేపటి క్రితమే మంచు మనోజ్ కూడా మీడియా తో మాట్లాడుతూ, నిన్న రాత్రి మోహన్ బాబుచే దాడికి గురైన రిపోర్టర్స్ కి క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా నిన్న రాత్రి మోహన్ బాబు మనోజ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆడియో పై మనోజ్ స్పందిస్తూ నాపై మా నాన్నగారు నిందలు వేయడం బాధించింది, ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, ఇక ఉందల్చుకోలేదు, నేడు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవాలను ఆధారాలతో సహా మీడియా ముందు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన ఘర్షణ లో మోహన్ బాబు తలకు గాయమైంది. నేడు ఆయన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ చేర్చారు కుటుంబ సభ్యులు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పై వివరణ ఇస్తూ కాసేపటి క్రితమే మంచు విష్ణు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. అదే విధంగా మనోజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించాడు. ముందుగా డాక్టర్లు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిని మీడియాకి వివరించారు. నిన్న రాత్రి ఆయనకి హార్ట్ బీట్ తక్కువ ఉండడం, బీపీ, హై టెన్షన్ ఏర్పడడం, అదే విధంగా కన్ను క్రింద బాగా వాయడంతో చికిత్స పొందేందుకు హాస్పిటల్ లో చేరారని, ఆయన చుట్టూ ఏమి జరుగుతుందో ఆలోచించుకోలేని స్థితిలోకి ఆయన వెళ్లిపోయాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు.
అనంతరం విష్ణు మాట్లాడుతూ ‘మా నాన్న నిన్న ఉద్దేశపూర్వకంగా మీడియా రిపోర్టర్స్ పై దాడి చేయలేదు. నిన్న మీరంతా చూసారు, ఒక 20 మంది మా ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వచ్చారు, ఆ సమయంలో హీట్ మూమెంట్ లో ఎదో అలా జరిగిపోయింది, అలా జరిగి ఉండకూడదు, దురదృష్టకరం, రిపోర్టర్ రంజిత్ కుటుంబంతో టచ్ లో ఉన్నాను, అతనికి అన్ని విధాలుగా అండగా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు విష్ణు. అలాగే మనోజ్ తో వివాదం గురించి విష్ణు స్పందిస్తూ ‘నేను లాస్ ఏంజిల్స్ లో కన్నప్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఆ సమయంలో ఇంట్లో ఇలా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. నేను లేని సమయంలో ఇవన్నీ జరిగిపోయాయి. మా నాన్న ఆడియో రికార్డు వదిలి తప్పు చేసాడు. నేను పక్కనే ఉండుంటే అలా జరగనిచ్చే వాడిని కాదు. మా ఇంట్లో గొడవలను నేను మీకు చెప్పదల్చుకోలేదు’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.