https://oktelugu.com/

Perni Nani: పేర్ని నానిని అడ్డంగా బుక్ చేసిన కూటమి సర్కార్!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది నేతలు రెచ్చిపోయారు. చాలా రకాలుగా తప్పులు చేశారు. ఇప్పుడు వారంతా మూల్యం చెల్లించుకుంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 11, 2024 / 01:33 PM IST

    Perni Nani

    Follow us on

    Perni Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్లలో పేర్ని నాని ఒకరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాని చాలా దూకుడుగా ఉండేవారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన బదులు కుమారుడు రంగంలోకి దిగారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పేర్ని నాని చాలా వరకు సైలెంట్ అయ్యారు. అయితే అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదుకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    * బియ్యం గల్లంతు
    మచిలీపట్నంలో నానికి చెందిన పౌరసరఫరాల గోదాములో 90 లక్షల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం గల్లంతయినట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో నాని పై క్రిమినల్ కేసులతో పాటు రెట్టింపు జరిమానా కోటి 80 లక్షలు విధించాలని పౌరసరఫరాల శాఖ సిఎండి ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో నానికి చెందిన నాలుగు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముని 2020లో ప్రభుత్వం లీజుకు తీసుకుంది. అయితే ఆ గోదాములో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ కి లేఖ రాశారు నాని. దాదాపుగా 3200 బస్తాల్లో తరుగు ఉన్నాయని.. ఈ మేరకు తాను సొమ్మును చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు నాని.

    * తనిఖీల్లో బయటపడిన వైనం
    అయితే ఈ ఫిర్యాదు నేపథ్యంలో గత నెల చివర్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 టన్నుల బియ్యం తగ్గినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 89 లక్షల 72,000గా గుర్తించారు. మరోసారి పూర్తిస్థాయిలో గోదామును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని.. అప్పుడు కూడా ఇలాగే వస్తే జరిమానా తో పాటు గోదామును బ్లాక్ లిస్టులో పెడతామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.