Manchu Manoj: మంచు మనోజ్… కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా బాల నటుడిగానే తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ హీరో. విభిన్నమైన పాత్రలు, వినూత్నమైన కధలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల కాలంలో ఆయన పలు వ్యక్తిగత కారణాల రీత్యా సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికి… పలు స్మజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. మంచు మనోజ్ ఆయన భార్య ప్రణతి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలం పాటు దేశమంతా స్నేహితులతో కలిసి చుట్టేసాడు మనోజ్. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన గురించి మరో వార్త సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అది ఏంటంటే మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారా అని. ఈ ప్రశ్నకు అవునననే సమాధానలే ప్రస్తుతం ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో మంచు మనోజ్ మాత్రం ఎప్పుడూ స్పందించ లేదు. ప్రణతితో విడాకుల అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మనోజ్ త్వరలోనే పెళ్లి పితలెక్కబోతున్నారని తెలుస్తుంది. ఈ మధ్యే ఆయన మాజీ భార్యతో విడాకుల ప్రక్రియ కూడా అధికారికంగా పూర్తయిందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మనోజ్ ఓ ఫారెన్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని… ఆమెనే రెండో పెళ్లి చేసుకుంటాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
2015 లో ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకోగా… తర్వాత ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం… మనోజ్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని అంటున్నారు. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత… ఇప్పుడు ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు మనోజ్. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరి ఆ ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మోహన్ బాబు ఒప్పుకుంటారా లేదా … మరి ఏ అమ్మాయిని మనోజ్ వివాహం చేసుకుంటారో అని సినివర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Manchu manoj ready for second marriage with foreigner
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com