spot_img
Homeఎంటర్టైన్మెంట్'మనోజ్ - బన్నీ' కలయికలో 'పుష్ప' !

‘మనోజ్ – బన్నీ’ కలయికలో ‘పుష్ప’ !

Manchu Manoj Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మంచు మనోజ్ గతంలో వేదం సినిమాలో కలిసి నటించారు. అయితే, తాజాగా ఈ కాంబినేషన్ మళ్ళీ తెర పైకి వచ్చేలా కనిపిస్తోంది. బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మంచు మనోజ్ నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే సుకుమార్, మనోజ్ కి కథ చెప్పాడని, మనోజ్ కూడా నటించడానికి అంగీకరించాడని సమాచారం. నిజానికి ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి మనోజ్ చేస్తోన్న పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి.

Also Read: శంకర్-రాంచరణ్ సినిమా అనౌన్స్.. దిల్ రాజ్ నిర్మాత.. కథ వింటే గూస్ బాంబ్స్ ఖాయం

విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని మొదట కమిట్ అయ్యాడు. కాకపోతే కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అవ్వడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ పాత్రలో మంచు మనోజ్ అయితే బాగుంటాడని, అతన్నే తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. పైగా మనోజ్ – బన్నీలది హిట్ కాంబినేషన్. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ లోపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: ప్రేమ‌పెళ్లి చేసుకున్న సినీతార‌లు.. మీ స్టార్లు ఉన్నారేమో చూడండి!

అన్నట్లు వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో బన్నీ పై షూట్ స్టార్ట్ చేస్తారట. ఆ తరువాత ఇక్కడే బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని.. ఈ సాంగ్ తరువాత సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ షూట్ ను కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version