
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. నిర్మాతగా ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎంఎస్ రాజు.. ఆ తర్వాత ఫ్లాపులతో సినిమా ఇండస్ట్రీలో వెనకబడ్డారు. ఇటీవలే డర్టీ హరి అనే సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు.
ఇక ఆయన కుమారుడు సుమంత్ ను మాత్రం ఎంఎస్ రాజు ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోయారు. ‘హ్యాపీ వెడ్డింగ్’, కేరింత లాంటి చిన్న చిత్రాల్లో హీరోగా మెరిసిన అశ్విన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.
హైదరాబాద్ శివారుల్లోని ఎంఎస్ రాజుకు చెందిన ఫాంహౌస్ లో అతితక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది.
సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు దీపిక. ఆమె అమెరికాలోని డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తోంది. ఆమెతో అశ్విన్ వివాహం ఈరోజు పూర్తయ్యింది. వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.