Manchu Manoj: మంచు కుటుంబం లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. క్రమశిక్షణ కి రోల్ మోడల్ గా ఉంటూ, ఇండస్ట్రీ లో పైకి ఎదిగిన వ్యక్తి మంచు మోహన్ బాబు. తన పిల్లలతో పాటు, విద్యానికేతన్ అనే విద్యాసంస్థలను ప్రారంభించి ఎన్నో వేల మంది విద్యార్థులకు ఆయన విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించాడు. అలాంటి వ్యక్తి కుటుంబం లో నేడు ఆస్తి వివాదాల కారణంగా పరువు మర్యాదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మంచు మనోజ్ పట్ల మోహన్ బాబు మొన్న రాత్రి దురుసుగా ప్రవర్తించి, అతని పై దాడి చేయడమే కాకుండా, తన మనుషులతో కొట్టించాడంటూ పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఫిర్యాదు చేసిన సంఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ, మీడియా మొత్తం వైరల్ అయ్యింది. కాసేపటి క్రితమే మంచు మనోజ్ కూడా మీడియా తో మాట్లాడాడు.
ఇది ఆస్తి కోసం చేస్తున్న పోరాటం కాదు, నా ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటం అంటూ మనోజ్ తీవ్రమైన మనస్తాపంతో మాట్లాడాడు. తనతో నేరుగా గొడవ పెట్టుకున్నా పర్వాలేదు కానీ, ఏ సంబంధం లేని నా భార్య ని, నా 7 నెలల పసి బిడ్డని లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. పోలీసులను రక్షణ కల్పించమని ఎదిగితే వాళ్ళు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, తనకి రక్షణ కోసం వచినటువంటి బౌన్సర్లను కూడా పోలీసులు బలవంతంగా తరిమేశారని, వాళ్లకి నా వాళ్ళని తరిమేందుకు ఏ అధికారం ఉందంటూ మనోజ్ ప్రశ్నించాడు. దీని గురించి నేను న్యాయ పోరాటం చేస్తానని, న్యాయం జరిగే వరకు దేశం లో ఉన్న ప్రతీ నాయకుడిని, అధికారులను కలుస్తానని మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మంచు మనోజ్ పట్ల జరుగుతున్న వాటిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నేడు నిన్న రాత్రి ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటి వాళ్ళను ట్యాగ్ చేసి, నాలుగు పేజీల కంప్లైంట్ తో తనకి న్యాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడు. నాలుగు గోడల మధ్య పరిష్కారం అవ్వాల్సిన ఈ సమస్యలు, ఇలా బహిరంగంగా బయటకి వచ్చి కొట్టుకునే స్థాయికి వచ్చిందంటే ఎంత దూరం విషయం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మోహన్ బాబు దీనిపై స్పందిస్తూ ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ముల మధ్య వివాదాలు రావడం సాధారణమే, మా ఇంట్లో వచ్చిన వివాదాన్ని మేమే పరిష్కరించుకుంటాం అని చెప్పుకొచ్చాడు. మరోపక్క మంచు విష్ణు దుబాయి నుండి ఇంటికి వచ్చి, మంచు మనోజ్ ని ఆయన కుటుంబాన్ని బయటకి గెంటేసినట్టు తెలుస్తుంది.