https://oktelugu.com/

Manchu Family: ‘మంచు’ వారి లొల్లి అంతా సౌందర్య బంగ్లా చుట్టూనే.. అసలేంటి కథ.?

మంచు మనోజు కుటుంబలో ఆస్తుల చిచ్చి రచ్చకెక్కింది. గతంలో ఇంట్లోనే ఉన్న ఈ వివాదాలు ఇప్పుడు వీధికెక్కాయి. ముఖ్యంగా మంచు మనోజ్, మోహన్ బాబు లమధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 11, 2024 / 08:22 AM IST

    Manchu Family(3)

    Follow us on

    Manchu Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన రియల్ లైఫ్ లోనూ రాజకీయాల్లో ప్రవేశించారు. పలు సందర్భాల్లో మోహన్ బాబు తన ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పుకునేవారు. తమ కుటుంబం క్రమశిక్షణకు మారుపేరు అనుకునేవారు. కానీ ఇప్పడు ఆయన కుమారుడు మంచు మనోజ్ తో గొడవలు రావడంతో ఆయన దీనిని తీవ్ర అవమానంగా ఫీలవుతున్నారు. తాజాగా మోహన్ బాబు నివాసం ఉంటున్న వద్దకు మంచు మనోజ్ బౌన్సర్లతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు నియంత్రణ కోల్పోయి మీడియాపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అసలు గొడవ ఎందుకు జరుగుతోంది? దేని కోసం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం ఏర్పడుతుంది? అనే వివరాల్లోకి వెళితే..

    మంచు మనోజు కుటుంబలో ఆస్తుల చిచ్చి రచ్చకెక్కింది. గతంలో ఇంట్లోనే ఉన్న ఈ వివాదాలు ఇప్పుడు వీధికెక్కాయి. ముఖ్యంగా మంచు మనోజ్, మోహన్ బాబు లమధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మోహన్ బాబు శంషాబాద్ శివారులోని జల్ పల్లిలోని ఓ లగ్జరీ ఫాంహౌజ్ లో ఉంటున్నారు. అయితే ఈ వివాదం అంతా ఈ బంగ్లా చుట్టేనని అర్థమవుతోంది. మోహన్ బాబుకు చెందిన ఇది తనకే కావాలని మంచు మనోజ్ పట్టుబడుడుతున్నాడు. కానీ అలా కుదరదని మోహన్ బాబు అంటున్నాడు.

    అయితే ఈ బంగ్లా గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది దివంగత నటి సౌందర్యకు చెందినది. ఆమెకు చెందిన దీనిని మోహన్ బాబు సొంతం చేసుకున్నారు. సౌందర్య చనిపోయిన తరువాత ఆమె కుటుంబ సభ్యులు దీనిని మోహన్ బాబుకు విక్రయించారని కొందరు చెబుతున్నారు. కానీ అక్రమంగా తీసుకున్నారని మరికొందరు వాదిస్తున్నారు. కానీ నిజమేంటో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫాం హస్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఇది లగ్జరీ లెవల్లో ఉండడంతో దీనిని సొంతం చేసుకోవాలని మంచ మనోజ్ పట్టుబడుతున్నాడు.

    కానీ మోహన్ బాబు మాత్రం తనకున్న ముగ్గురి సంతానానికి సమానంగా ఆస్తులు ప్రకటిస్తానని చెప్పారు. మోహన్ బాబుకు విష్ణుతో పాటు మనోజ్ కుమారులు ఉండుగా కూతురు లక్ష్మీ ఉన్నారు. అయితే ఈ గొడవ ఎక్కువగా మంచు మనోజ్, మోహన్ బాబు మధ్యే ఎక్కువగా సాగుతోంది. ఈ విషయంలో ఎవరికి వారే తమదే న్యాయం అని అంటున్నారు. అయితే తాజాగా జరిగిన గొడవలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం కలకలం రేపుతోంది. విషయంలో మంచు ఫ్యామిలీ మొత్తానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉండగా మోహన్ బాబు తాజాగా మనోజ్ ను ఉద్దేశించి ఓ ఆడియోను రిలీజ్ చేశారు. కేవలం ఆస్తి కోసం తన పరువు తీస్తున్నావని మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వల్ల తల్లి ఆసుప్రతి పాలైందని, ఎవరో చెప్పిన మాటలు విని తండ్రిపై దాడి చేయడం తగదని అన్నారు. ఇక మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు ఆందోళన చేస్తున్నారు.