Bigg Boss Telugu 8 : జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అవినాష్ కామెడీ టైమింగ్ కి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లోనూ అవినాష్ ఉండేవాడు. కానీ బిగ్ బాస్ లో పాల్గొనడం కోసం ఆయన జబర్దస్త్ తో పాటు, ఈటీవీ లో తనకి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్ 4 ద్వారా ఆయన కోట్లాది మంది ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఆయన జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ యాజమాన్యం అసలు ఒప్పుకోలేదు. దీంతో ఎటు పోవాలో తెలియని పరిస్థితి లో స్టార్ మా ఛానల్ అవినాష్ కి అండగా నిల్చింది. ఆయనకీ బోలెడన్ని షోస్ ఇచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగా పేలడం తో స్టార్ మా ఛానల్ లో అవినాష్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ షో లేదు అనే రేంజ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పుడు ఆయన బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఆ కారణం చేత అవినాష్ కి ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు కానీ, ఈ సీజన్ లో ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కారణంగానే టీఆర్ఫీ రేటింగ్స్ బాగా వచ్చాయని, అవినాష్ లేని బిగ్ బాస్ సీజన్ 8 ని అసలు ఊహించుకోలేము అనే విధమైన టాక్ బాగా వెళ్ళింది. ముఖ్యంగా ఆడియన్స్ హాట్ స్టార్ లో లైవ్ చూసేదే అవినాష్ ఎంటర్టైన్మెంట్ కోసం. అతను లేకపోతే చాలా బోరింగ్ గా ఉండేది అనేది విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఈ వారం అవినాష్ లెకపొయ్యుంటే మీరే ఊహించుకోండి, ఎంత బోరింగ్ గా ఉండేదో. అయితే అవినాష్ కి 10 లక్షల రూపాయిల సూట్ కేసు అందేలా బిగ్ బాస్ టీం ప్లానింగ్ చేస్తుందని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
శనివారం ఎపిసోడ్ లో ఇది జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి మంచి రెమ్యూనరేషన్ ప్యాకేజ్ తోనే అడుగుపెట్టాడు. ఎందుకంటే బయట ఆయన ఇప్పుడు టాప్ మోస్ట్ సెలబ్రిటీ. చేతినిండా ఈవెంట్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మంచి న్యాచురల్ కామెడీ టైమింగ్ ఉంది, ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుంటుంది, టీఆర్ఫీ అదిరిపోతోంది అనే ఉద్దేశ్యంతోనే అవినాష్ కి వారానికి మూడు లక్షల 50 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుంది. 10 వారాలు ఆయన హౌస్ లో ఉన్నందుకు గానూ బిగ్ బాస్ టీం ఆయనకి 35 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా 10 లక్షల రూపాయిల సూట్ కేసు తో కలిపి మొత్తం 45 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తో ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాబోతున్నాడు.