https://oktelugu.com/

Mohan Babu : మోహన్ బాబు ఫ్యామిలీ లో ఏం జరుగుతుంది..?ఎవరికి వారు రౌడీల్లా మారుతున్నారా..?

కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు వరుసగా వివాదాల్లో నిలుస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 08:26 AM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu : కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు వరుసగా వివాదాల్లో నిలుస్తున్నాడు. తన కొడుకుల మీద దాడి చేస్తున్నాడు అంటూ పలు రకాల విమర్శలను ఎదుర్కొంటున్నాడు. మరి ఆయనకున్న వయస్సును బట్టి ఏజ్ లో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇలాంటి గొడవలను పెట్టుకోవడం అనేది సరైనదైతే కాదు…

    మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇక దీనికి కారణం ఏదైనా కూడా వాళ్ళందరూ వార్తల్లో నిలవడం అనేది నిజంగా చాలా వరకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా మోహన్ బాబు తన మీద దాడి చేయించాడు అంటూ మంచు మనోజ్ హాస్పిటల్లో చేరగా ఇవాళ్ళ తన బిడ్డ మోహన్ బాబు ఇంట్లో ఉందని తనను తీసుకొచ్చుకోవడాని అక్కడికి వెళ్ళిన మనోజ్ ఇంటి ముందు గేట్లు వేసి ఉన్నాయి. దాంతో గేట్లు బద్దలు కొట్టుకునే ప్రయత్నం చేసిన మంచు మనోజ్ ను ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు కూడా రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు విసిగిపోయి రిపోర్టర్ల మీద దాడి చేయడం చూశాం. ఇక చేది ఏమైనా కూడా తన ఇద్దరు కొడుకులతో కలిసి మోహన్ బాబు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను బరీగతం చేయడం అనేది చాలా వరకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇవాళ్ల పొద్దున దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు కూడా మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. దాంతో మనోజ్ బౌన్సర్లు విష్ణుని అడ్డుకున్నారు. మరి వీళ్ళు ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి.

    వీళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపించేవారు ఎవరు అంటూ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబుకు తీవ్రమైన అస్వస్థత ఉండడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది.

    మరి ఈ వయసులో మోహన్ బాబు ఇంత రిస్క్ చేస్తూ ఎందుకు తన కొడుకులతో గొడవలు పెట్టుకుంటున్నాడు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకొని కలెక్షన్ కింగ్ గా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.

    మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు సినిమాలేవి చేయకుండా ఖాళీగా ఉన్నప్పటికి తన కొడుకులతో గొడవలను పెట్టుకుంటూ వార్తల్లో నిలవడం అనేది చాలావరకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ గొడవలకి తొందర్లోనే పుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అంతే తప్ప ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకి తెచ్చుకోవడం అనేది సరైన పద్ధతి అయితే కాదు. మరి వీళ్ళకి చెప్పి వీళ్ళను ఒప్పించి ఆ గొడవలకు పులిస్టాప్ పెట్టేవారు ఎవరు అనేది తెలియాల్సి ఉంది…