Mana Shankara Varaprasad Garu First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రొడ్యూసర్లందరికి భారీ లాభాలను తీసుకొచ్చి పెట్టాయి. అందుకే అతనితో సినిమాలు చేయడానికి హీరోలు ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక అలాంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఇక ఇప్పటికే సినిమా యూనిట్ తో పాటు కొంతమంది సినిమా మేధావులు సైతం ఈ సినిమాని వీక్షించారట. మూవీ చూసిన సినిమా మేధావులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకోబోతోంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఈ మూవీ కథావిషయానికి వస్తే శంకర్ వరప్రసాద్ కి తన భార్యకి మధ్య కొన్ని గొడవలు జరుగుతాయి. దాంతో తన భార్య తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉండడంతో ఆ కొడుకు బాధ్యతను ఎవరు తీసుకోవాలి అనే విషయం మీద చాలా వరకు చర్చలైతే జరుగుతాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ విడిపోయే సమయానికి విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి వీళ్లిద్దరిని ఎలా కలిపాడు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది…
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించాడు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది అంటూ సినిమాని చూసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.
చిరంజీవి అటు కామెడీని చేసుకుంటూనే, యాక్షన్ ఎపిసోడ్స్ లో సైతం రఫ్ఫాడించాడట. చిరంజీవి – వెంకటేష్ మధ్యలో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలువబోతున్నాయి… ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో సైతం చిరంజీవి మరోసారి తన నట విశ్వరూపం చూపించారట… అనిల్ రావిపూడి 2025 సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాని ఎంత సక్సెస్ ఫుల్ గా నిలపాడో ఈ సినిమాతో అంతకంటే ఎక్కువ సక్సెస్ ని సాధించబోతున్నాడు అంటూ సినిమాను చూసినవాళ్లు చెబుతున్నారు.
ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో భీమ్స్ అనుసరించిన విధానం కూడా చాలా బాగుందని చాలా ఫ్రెష్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడని చెబుతున్నారు… నిజంగానే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో 12 రోజులపాటు వేచి ఉండాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రం చిరంజీవి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడు…